Breaking News

గేమ్ ఛేంజర్ రికార్డ్ బ్రేక్.. మూడు రోజుల్లో ఎన్ని కోట్లంటే?

Published on Sun, 10/05/2025 - 15:56

కన్నడ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం కాంతార ఛాప్టర్-1. గతంలో బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా నిలిచిన కాంతారకు ప్రీక్వెల్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ ఏడాది విజయదశమి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. తొలి రోజే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. మొదటి రోజు రూ.89 కోట్ల గ్రాస్ సాధించిన కాంతార ఛాప్టర్-1.. మూడు రోజుల్లోనే రూ.150 కోట్ల మార్క్‌ను దాటేసింది. కేవలం మూడు రోజుల్లోనే దేశవ్యాప్తంగా రూ. 162.85 కోట్ల నెట్ వసూళ్లు సాధించింది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూస్తే మూడు రోజుల్లో రూ.235 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 

ఈ క్రమంలోనే బాక్సాఫీస్ వద్ద పలు రికార్డులు సృష్టించింది. ఇప్పటికే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన కన్నడ చిత్రాల జాబితాలో మొదటిస్థానంలో నిలిచింది. ఈ మూవీ సు ఫ్రమ్ సో (రూ. 92 కోట్ల నికర) జీవితకాల కలెక్షన్స్‌ను అధిగమించింది. అంతేకాకుండా ఈ ఏడాది విడుదలైన సల్మాన్ ఖాన్ సికందర్(రూ. 110 కోట్లు), రామ్ చరణ్ 'గేమ్ ఛేంజర్' (రూ. 131 కోట్లు) లాంటి పెద్ద సినిమాల ఆల్ టైమ్‌ కలెక్షన్స్‌ను దాటేసింది. అదే సమయంలో రూ. 150 కోట్ల మార్కును దాటేసిన నాల్గవ కన్నడ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాకుండా రిషబ్ శెట్టి కాంతార ఛాప్టర్-1 విదేశాల్లోనూ సత్తా చాటుతోంది. మొదటి రెండు రోజుల్లోనే దాదాపు రూ. 22 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. కాగా.. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్, గుల్షన్ దేవయ్య, జయరామ్ కూడా కీలక పాత్రల్లో నటించారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)