Breaking News

ఆ హీరోకు యాక్టింగే రాదు, ఏదో కవర్‌ చేస్తాడంతే!

Published on Fri, 01/23/2026 - 17:23

బాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్‌ హీరోయిన్‌గా రాణించింది రిమి సేన్‌. ఇప్పుడు మాత్రం సినిమాలకు గుడ్‌బై చెప్పేసి దుబాయ్‌లో రియల్‌ ఎస్టేట్‌ ఏజెంట్‌గా పని చేస్తోంది. ఇండియాలో ఏజెంట్లను ఏదో తప్పుపనిచేసేవారిలా చూస్తారు, కానీ అక్కడ దర్జాగా బతుకుతున్నానని చెప్తోంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్‌లోని ఓ టాప్‌ హీరోకు యాక్టింగ్‌ రాదని గాలి తీసింది. అదే సమయంలో అతడి తెలివితేటల్ని మెచ్చుకుంది.

యాక్టింగ్‌ రాదన్న కామెంట్స్‌
ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు జాన్‌ అబ్రహం. రిమి సేన్‌ మాట్లాడుతూ.. జాన్‌ అబ్రహం నాకు వ్యక్తిగతంగా తెలుసు. అతడు మొదట్లో మోడల్‌గా పని చేశాడు. యాక్టింగ్‌ అనేదే రాదు. ఆ విషయం గురించి అందరూ మాట్లాడుతుంటే అతడు పట్టించుకునేవాడు కాదు. అతడు కేవలం తన యాక్టింగ్‌కు బదులుగా స్టైలిష్‌గా, స్క్రీన్‌పై మరింత బాగా కనిపించే పాత్రల్ని మాత్రమే ఎంచుకునేవాడు. ఉదాహరణకు యాక్షన్‌ సినిమాలు. 

తెలివైనవాడు
ఆ సినిమాల్లో అతడు బాగా కనిపించేవాడు, అప్పుడు జనాలు అతడేం చేస్తున్నాడనేది పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఆ రకంగా అతడు చాలా తెలివైన నటుడు. అయితే పాపులారిటీ పెరుగుతూ ఉండేసరికి అతడే నెమ్మదిగా యాక్టింగ్‌ నేర్చుకున్నాడు. పదేపదే కెమెరా ముందుకు వస్తూ ఉంటే అది మనకు ఎంతో కొంత అనుభవం నేర్పుతుంది కదా. అలా తనపై తనకు నమ్మకం ఏర్పడ్డాక నటనకు అవకాశమున్న పాత్రల్ని ఎంచుకున్నాడు. 

రానురానూ..
తన పరిధులేంటో తనకు బాగా తెలుసు కాబట్టే మొదట్లో యాక్షన్‌.. రానురానూ పర్ఫామెన్స్‌కు ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే అతడిని తెలివైనవాడని చెప్తుంటాను. తర్వాత నిర్మాణరంగంలోనూ అడుగుపెట్టి హిట్లు కొట్టాడు, బిజినెస్‌మెన్‌గా రాణించాడు అని రిమి సేన్‌ చెప్పుకొచ్చింది. జాన్‌ అబ్రహం, రిమి సేన్‌.. ధూమ్‌, గరం మసాలా, హ్యాట్రిక్‌ సినిమాల్లో కలిసి నటించారు. జాన్‌ అబ్రహం సినిమాల విషయానికి వస్తే.. ఈయన చివరగా టెహ్రాన్‌ సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం ఇతడి చేతిలో రెండు సినిమాలున్నాయి.

చదవండి: కీర్తి సురేశ్‌ హోంటూర్‌.. ఇల్లులాగే లేదు

Videos

Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..

Perni Nani: జగన్ ట్రెండ్ సెట్టర్.. మీరు ఫాలోవర్స్..

GVMC ఉద్యోగి భౌతికకాయానికి YSRCP నేతల నివాళులు

ఉదయగిరిలో మగ పెద్ద పులి జాగ్రత్త..అటవీశాఖ హెచ్చరిక

ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

KTR: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొనసాగుతున్న సిట్ విచారణ

పట్టాలెక్కిన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ జెండా ఊపిన ప్రధాని

RS Praveen : ఫోన్ ట్యాపింగ్ కేసులో రేవంత్ రెడ్డిని విచారించాలి

Chandrasekhar : సచివాలయం ఉద్యోగులను చంపేస్తున్నారు.. ఇంకెంత మందిని బలి తీసుకుంటావ్

Kakinada : ఈ ప్రభుత్వానికి ఓటు వేసి నరకం చూస్తున్నాం..

Photos

+5

తెలుగు రాష్ట్రాల్లో వసంత పంచమి వేడుకలు (ఫోటోలు)

+5

టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ బర్త్‌ డే పార్టీలో సెలబ్రిటీల సందడి (ఫోటోలు)

+5

Anchor Suma : అందం పెరుగుతోంది కానీ తగ్గట్లేదు (ఫోటోలు)

+5

లుక్‌ టెస్ట్‌ అంటూ ఫోటోలు వదిలిన శివాత్మిక రాజశేఖర్‌

+5

సుకుమార్ కుమార్తె బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

జిమ్‌లో కష్టపడుతున్న అనసూయ (ఫోటోలు)

+5

ఆర్సీబీ క్వీన్స్‌.. అదిరిపోయే లుక్స్‌.. స్మృతి స్పెషల్‌ (ఫొటోలు)

+5

కళ్లతో మాయ చేస్తూ.. అనుపమ గ్లామర్ షో (ఫొటోలు)

+5

మంచు ముద్దలలో మునిగిన లోయ (ఫొటోలు)

+5

ఇది అంతులేని కథలా.. సిట్‌ విచారణ వేళ కేటీఆర్‌ (చిత్రాలు)