టీమిండియా క్రికెటర్ గిల్‌తో పెళ్లి? సిగ్గుపడుతూనే హీరోయిన్ క్లారిటీ

Published on Thu, 07/18/2024 - 13:22

క్రికెటర్లు హీరోయిన్లతో ప్రేమలో పడటం కొత్తేం కాదు. టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ పెళ్లి చేసుకున్నది బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మనే. యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్ గురించి వస్తున్న రూమర్స్ గురించి చెప్పనక్కర్లేదు. ఎందుకంటే గతంలో సచిన్ కూతురితో పాటు హీరోయిన్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఏకంగా డిసెంబరులో ఓ హీరోయిన్‌తో పెళ్లి ఫిక్స్ అని చెప్పుకొచ్చారు. ఇ‍ప్పుడు అలాంటి కామెంట్స్‌పై సదరు హీరోయినే స్వయంగా స్పందించింది.

(ఇదీ చదవండి: రెండో పెళ్లికి రెడీ అయిన స్టార్ హీరో హృతిక్ రోషన్.. హింట్ ఇచ్చేశాడా?)

ఐపీఎల్, టీమిండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శుభ్‌మన్ గిల్.. మొన్నీమధ్యే జరిగిన జింబాబ్వే సిరీస్‌లోనూ భారత జట్టుకు కెప్టెన్సీ చేసి ఆకట్టుకున్నాడు. తాజాగా ఇతడి పెళ్లి గురించి ఓ రూమర్ తెగ వైరల్ అయింది. సీరియల్ హీరోయిన్ రిద్ధిమా పండిట్‌తో ఏడడుగులు వేయబోతున్నాడని అన్నారు. ఇదే ప్రశ్న రిద్ధిమని తాజాగా ఓ ఇంటర్వ్యూలో అడగ్గా.. దాన్ని కొట్టేపారేసింది.

'మా మధ్య ఎలాంటి బంధం లేదు. అతడు అద్భుతమైన స్పోర్ట్స్ పర్సన్ అని తెలుసు. అంతే తప్ప అతడెవరో నాకు తెలియదు. ఒకవేళ అతడిని కలిస్తే మాత్రం ఈ రూమర్స్ గురించి చెప్పి నవ్వుకుంటాం. అతడు చాలా క్యూట్ ఉన్నాడు కానీ అలాంటిదేం (పెళ్లి) జరగదు' అని రిద్ధిమ చెప్పుకొచ్చింది. గతంలో గిల్.. సచిన్ కూతురు సారా, హీరోయిన్ సారా అలీఖాన్‌తో డేటింగ్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. కానీ అవి కూడా నిజం కాదని తేలిపోయింది.

(ఇదీ చదవండి: 'కల్కి' ఖాతాలో నెవ్వర్ బిఫోర్ రికార్డ్.. బలైపోయిన షారూఖ్)

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)