Breaking News

'అందుకే జైలులో నాగిని డ్యాన్స్ చేశా'.. సుశాంత్ ప్రియురాలు!

Published on Fri, 10/06/2023 - 16:52

ఎంఎస్‌ ధోని మూవీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ విషాదం ఆయన అభిమానుల్లో తీవ్రంగా కలిచివేసింది. 2020లో ముంబైలోని బాంద్రా నివాసంలో సుశాంత్ సూసైడ్ తర్వాత అతని ప్రియురాలు రియా చక్రవర్తిపై ఆరోపణలు రావడంతో ఎన్సీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆమె సోదరుడు షోక్ చక్రవర్తి కూడా నిందితుడిగా ఉన్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన రియా.. తన జైలు జీవితం గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. జైలులో ఉన్న ఇతర మహిళలను చూసి తాను చాలా నేర్చుకున్నానని చెప్పింది.

ఈ కేసులో నేను కేవలం నిందితురాలినే తప్ప.. దోషిని కాదని రియా స్పష్టం చేశారు. బెయిల్ వచ్చిన తర్వాత అక్కడున్న జైలులో మహిళలతో కలిసి నాగిన్ డ్యాన్స్ చేసిన విషయాన్ని ఆమె గుర్తు చేసుకున్నారు. తనకు బెయిల్ వచ్చిన రోజు తన సోదరుడికి బెయిల్ రాలేదని.. ఆరోజు తాను చాలా బాధపడ్డానని తెలిపారు. 

అయితే తనకు బెయిల్ వచ్చిన రోజు డ్యాన్స్ చేస్తానని నా తోటి మహిళా ఖైదీలకు మాట ఇచ్చానని.. అందుకే అలా చేశానని తెలిపింది రియా. వారిని నేను మళ్లీ చూడలేను కాబట్టే.. వారితో  ఐదు నిమిషాల పాటు డ్యాన్స్‌ చేసి ఆనందాన్ని ఇవ్వగలిగానని చెప్పుకొచ్చింది. ఇది నా జీవితంలో అత్యంత ఆనందకరమైన క్షణమని వెల్లడించింది. మహిళలతో కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన ఉత్సాహం, ఆనందం, సంతోషం బహుశా ఇప్పటి వరకు తన జీవితంలో ఎప్పుడు చూడలేదని రియా అన్నారు. ఈ కేసులో రియా  దాదాపు ఆరు వారాల పాటు బైకుల్లా జైలులో రిమాండ్‌లో ఉన్నారు.  కాగా.. రియా ప్రస్తుతం ఎంటీవీ రోడీస్: కర్మ యా కాంద్‌లో కనిపించనుంది. ఇందులో ఆమె గ్యాంగ్ లీడర్ పాత్ర పోషిస్తోంది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)