Breaking News

డ్రగ్స్‌ కేసులో హీరోయిన్‌కు బిగ్‌ రిలీఫ్‌

Published on Wed, 07/19/2023 - 11:51

బాలీవుడ్‌ సినీ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతికి సంబంధించిన డ్రగ్స్‌ కేసులో నటి రియా చక్రవర్తి బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. రియాకు మంజూరైన బెయిల్‌ను సవాలు చేయడం లేదని నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్‌సీబీ) సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇదీ ఆమెకు ఓ రకంగా శుభవార్తనే చెప్పవచ్చు. అయితే.. ఆమెపై ఇప్పటికే ఉన్న నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని సెక్షన్ 27-ఎకి సంబంధించిన చట్టాన్ని తెరిచే ఉంచాలని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, ఎంఎం సుందరేష్‌లతో కూడిన ధర్మాసనానికి తెలిపారు.

(ఇదీ చదవండి: సర్జరీ చేయించుకోనున్న మెగా హీరో, అప్పటిదాకా సినిమాలకు దూరం!)

రియాపై నమోదైన సెక్షన్ 27-ఎ అంటే ఇదే
నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో రియా చక్రవర్తిపై అక్రమ మాదకద్రవ్యాలతో పాటు అక్రమ రవాణాకు సంబంధించి ఫైనాన్సింగ్ చేయడమే కాకుండా అలాంటి వారికి ఆశ్రయం కల్పించడం వంటి వాటికి సంబంధించిన నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టంలోని కఠినమైన సెక్షన్ 27-ఎ కింద అభియోగాలు మోపింది. ఇది గరిష్టంగా 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు బెయిల్ మంజూరుపై నిషేధాన్ని కలిగి ఉంటుంది. అయితే.. చక్రవర్తి కేసులో డ్రగ్స్‌కు సంబంధంచి ఆమె ఫైనాన్సింగ్ లేదా ఆశ్రయం కల్పించినట్లు ఆధారాలు లేనందున  సెక్షన్ 27-A వర్తించదని హైకోర్టు పేర్కొంది.

అప్పట్లో జరిగింది ఇదీ
2020లో కలకలం రేపిన దివంగత నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ డ్రగ్‌ కేసు కేసులో నటి రియా చక్రవర్తి డ్రగ్‌ కోనుగోలు చేసి సుశాంత్‌కు ఇచ్చినట్లు ఆరోపిస్తూ నేషనల్‌ నార్కొటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో(ఎన్‌సీబీ) చార్జిషీట్‌ దాఖలు చేసింది. ఆమెతో మరో పాటు 34 మంది పేర్లను ఎన్‌సీబీ చార్జీషీట్‌లో పేర్కొంది. కాగా రియా డ్రగ్స్‌ కొనుగోలు చేసి సుశాంత్‌కు ఇవ్వడం వల్లే అతడు ఈ అలవాటుకు బానిసయ్యాడని, సుశాంత్‌ మరణానికి రియా ఇచ్చిన డ్రగ్సే కారణమని ఎన్‌సీబీ తమ చార్జిషీట్‌లో వెల్లడించింది. ఈ కేసులో సుమారు నెలరోజుల పాటు జైల్లో ఉన్న రియా బెయిల్‌పై విడుదల అయింది.

(ఇదీ చదవండి: జీవిత, రాజశేఖర్‌కు ఏడాది జైలుశిక్ష.. బెయిల్‌)


 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)