Breaking News

నన్ను చంపడానికి కాంట్రాక్ట్‌.. చంద్రబాబు, లోకేశ్‌ ఖండించనేలేదు!

Published on Wed, 12/27/2023 - 18:02

దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ తల నరికి తెచ్చినవారికి రూ.కోటి ఇస్తానని ఏపీకి చెందిన అమరావతి పరిరక్షణ సమితి అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివాసరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్‌ డిబేట్‌లో ఈ వ్యాఖ్యలు చేయగా అందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్జీవీ పోలీసులకు ఆశ్రయించారు. బుధవారం సాయంత్రం డీజీపీని కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.

(ఇది చదవండి: 'తల నరికితే రూ.కోటి'.. డీజీపీని కలిసిన ఆర్జీవీ!)

విజయవాడలో ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ.. 'ఓ ఛానల్‌లో కొలికపూడి శ్రీనివాసరావు నా తల తెస్తే కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు. నన్ను చంపడానికి టీవీ లైవ్లో డైరెక్ట్‌గా కాంట్రాక్ట్‌ ఇచ్చారు. అక్కడున్న యాంకర్‌ సాంబశివరావు మాటవరసకు వద్దని వారిస్తున్నా కొలికపూడి అదే మాట మూడుసార్లు చెప్పారు. అతడి వ్యాఖ్యల వల్ల వేరేవాళ్లు ఇన్‌స్పైర్‌ అయ్యే అవకాశం ఉంది. ఏ టీవీ ఛానల్‌లో అయితే ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడో సదరు టీవీ ఛానల్‌ ఎండీకి సైతం ఈ కుట్రలో భాగస్వామ్యం ఉంది.

దీనిపై కొలికపూడి, యాంకర్‌ సాంబశివరావు, ఛానల్‌ ఎండీ బిఆర్‌ నాయుడులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేశాను. కొలికపూడి ఈ వ్యాఖ్యలు చేసి 24 గంటలు గడిచినా చంద్రబాబు, లోకేశ్‌, పవన్‌ కల్యాణ్‌ ఖండించలేదు. ఇక వ్యూహం సినిమాకు తెలుగుదేశం భయపడుతోంది. ఈ సినిమా రిలీజ్‌ అవుతుందంటేనే టీడీపీ నేతలు గుమ్మడికాయల దొంగలా భుజాలు తడుముకుంటున్నారు' అని వ్యాఖ్యానించారు ఆర్జీవీ.

(ఇది చదవండి: ధనుష్‌తో లింక్‌ చేశారు.. రెండో పెళ్లి గురించి..: మీనా)

Videos

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

చంద్రబాబుపై వైఎస్ జగన్ సంచలన ట్వీట్

అప్పిరెడ్డికి భద్రత కూడా కల్పించలేమన్న జైలు అధికారులు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బర్త్ డే సెలెబ్రేషన్స్

రామాయణ రికార్డుల జాతర

రామాయణం చిత్రంపై రామ్ గోపాల్ వర్మ ఆసక్తికర పోస్ట్

బంగారం కొనాలా? వద్దా? రానున్న 15 రోజుల్లో ఏం జరగబోతుందంటే?

జైల్లోలేళ్ల అప్పి రెడ్డిని పరామర్శించిన అంబటి రాంబాబు

YSRCP ఏజెంట్లపై TDP నేతల దాడి.. రమేష్ గౌడ్ పరామర్శ

అత్తను పెండ్లి చేసుకున్న అల్లుడు

Photos

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)

+5

19 ఏళ్లకొకసారే ఇలా.. మంజుల బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

శ్రీకాంత్ కూతురిని చూశారా? ఎలా మెరిసిపోతోందో? (ఫొటోలు)

+5

జపాన్‌లో అత్తమామలతో కలిసి రష్మిక సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

టాలీవుడ్ సెలబ్రిటీస్ ఇంట్లో సందడిగా దీపావళి వేడుకలు (ఫొటోలు)

+5

బర్త్ డే ప్లస్ దీపావళి.. ఫ్యామిలీతో అనసూయ సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దివాళి ఫొటోలు పంచుకున్న భూమిక, ప్రగ్యా జైస్వాల్ (ఫొటోలు)

+5

దివాళి వేళ.. అనుపమ (ఫోటోలు)

+5

జాన్వీ ప్లాన్ చేసిన ఖుషి కపూర్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)