రివాల్వర్‌ రీటాకు టైమ్‌ ఫిక్స్‌

Published on Tue, 11/11/2025 - 06:57

పాన్‌ ఇండియా స్థాయిలో మంచి క్రేజ్‌ ఉన్న నటి కీర్తీ సురేశ్‌(Keerthy Suresh). ఆ మధ్య మహానటి, దసర, సినీ కాగితం వంటి చిత్రాలలో తన నటనకు గానూ ప్రశంసలు అందుకున్న ఈ భామ ఇటీవల నటించిన కొన్ని చిత్రాలు ఆశించిన రీతిలో విజయం సాధించలేదు. ముఖ్యంగా తమిళంలో మంచి అంచనాలతో తెరకెక్కిన రఘు తాతా చిత్రం పూర్తిగా నిరాశ పరిచింది. అదే విధంగా హిందీలో నటించిన తొలి చిత్రం బేబీజాన్‌  కూడా అపజయాన్నే మిగిల్చింది. అలాంటి పరిస్థితుల్లో కీర్తీ సురేశ్‌ గత ఏడాది తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోని తాటిల్‌ను పెళ్లి చేసుకుని నటనకు చిన్న గ్యాప్‌ ఇచ్చారు.

ఆ తరువాత ఈమె నటించిన వెబ్‌ సిరీస్‌ ఉప్పు కప్పురంబు ఓటీటీలో స్ట్రీమింగ్‌ అయింది. అలా గత ఏడాది నుంచి ఈ బ్యూటీకి హిట్‌ లేకుండాపోయింది. కాగా పెళ్లికి ముందు నటించిన చిత్రాల్లో రివాల్వర్‌ రీటా(Revolver Rita) ఒకటి. ది రూట్‌ సంస్థ, ది ఫ్యాషన్‌ స్టూడియోస్‌ సంస్థ కలిసి నిర్మించిన ఈ చిత్రానికి జేకే.చంద్రు దర్శకత్వం వహించారు. ఇది హీరోయిన్‌ ఓరియన్‌టెడ్‌ కథా చిత్రం అన్నది గమనార్హం. కామెడీ నేపథ్యంలో సాగే ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌లో రాధికా శరత్‌ కుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు.  దీనికి శ్యాన్‌ లోల్డన్‌ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని గత ఏడాది ఆగస్ట్‌లోనే విడుదల కావలసింది. 

కారణాలేమైనా విడుదల వాయిదా పడింది. కాగా తాజాగా రివాల్వర్‌ రీటాను ఈ నెల 28న విడుదల చేయడానికి ప్లాన్‌ రెడీ చేశారు. కాగా ఈ చిత్ర విజయం నటి కీర్తీసురేశ్‌కు చాలా అవసరం. మరి ఇది ఎలాంటి రిజల్డ్‌ను ఇస్తుందో చూడాలి. ప్రస్తుతానికి కోలీవుడ్‌లో కొత్తగా అవకాశాలు లేవు. కానీ, తెలుగులో వరుసగా అవకాశాలు వరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. 

Videos

మహిళపై టీచర్ అత్యాచార యత్నం

తిరుపతిలో అయ్యప్ప భక్తులకు అవమానం

విలన్ గా ఉపేంద్ర... సౌత్ సినీ ఇండస్ట్రీలో హాట్ టాక్..!

YSRCP నేత ఓబుల్ రెడ్డిపై హత్యాయత్నం

Anantha Venkatarami: ప్రైవేటీకరణ ఆపేవరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధం

YSRCP Leaders: బాబు అరాచక పాలన ఎలా ఉందంటే.... ప్రశ్నిస్తే తప్పుడు కేసులతో..

అప్పుడు పుల్వామా.. ఇప్పుడు రెడ్ ఫోర్ట్.. సేమ్ సీన్ రిపీట్

మహిళతో టీడీపీ నేత బూతుపురాణం.. ఆడియో లీక్ వైరల్..

డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కైన కాంగ్రెస్ నేత

మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు

Photos

+5

'గత వైభవం' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. పోలింగ్‌ కేంద్రాలకు తరలివస్తున్న ఓటర్లు (ఫొటోలు)

+5

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక.. ఓటేసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘సంతాన ప్రాప్తిరస్తు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

ఢిల్లీ ఎర్రకోట సిగ్నల్‌ వద్ద భారీ పేలుడు (చిత్రాలు)

+5

తెలుగమ్మాయి ఆనంది గ్లామరస్ ఫొటోలు

+5

కిదాంబి శ్రీకాంత్-శ్రావ్య వర్మ పెళ్లిరోజు స్పెషల్ (ఫొటోలు)

+5

నాథ్‌ద్వారా కృష్ణుడి ఆలయంలో ముకేశ్‌ అంబానీ (ఫొటోలు)

+5

నా హ్యాపీ బర్త్‌డే.. ప్రేయసికి పృథ్వీ షా థాంక్స్‌ (ఫొటోలు)

+5

Ande Sri: ప్రజాకవి అందెశ్రీ అరుదైన (ఫొటోలు)