Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..
Breaking News
నన్ను జైల్లో వేస్తానని బెదిరింపులు.. ప్రభాస్ కల్కి చూశారుగా!
Published on Fri, 01/23/2026 - 10:37
వీధి కుక్కల్ని అన్యాయంగా చంపేస్తున్నవారిపై నటి రేణూ దేశాయ్ ఇటీవల తీవ్రంగా మండిపడింది. కుక్కల్ని చంపేస్తే ఆ కర్మ అనుభవిస్తారంటూ మండిపడింది. ఆమె వ్యాఖ్యలను కొందరు సమర్థించగా మరికొందరు మాత్రం ట్రోల్ చేశారు. ఈ ట్రోలింగ్‌పై తాజాగా రేణూ దేశాయ్ స్పందించింది. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది.
ఒక్కటే కోరుకుంటా..
అందులో ఆమె మాట్లాడుతూ.. నేను ప్రెస్‌మీట్‌లో 30 నిమిషాలు మాట్లాడాను. అందులోని మాటల్ని అక్కడక్కడా కట్ చేసి వేరే అర్థం వచ్చేలా వీడియోలు వైరల్ చేస్తున్నారు. మనుషులైనా, జంతువులైనా అందరూ బాగుండాలని మాత్రమే నేను కోరుకుంటాను. వీధికుక్కల్ని షెల్టర్‌కు తరలించాలని చెప్పినందుకు జంతుప్రేమికులు నాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నాపై అంత ద్వేషమా?
నన్ను జైల్లో వేస్తామని బెదిరిస్తున్నారు. గతేడాది వెయ్యికి పైగా కుక్కల్ని నేను కాపాడాను. అలాంటిది నాపై అంత ద్వేషం చూపిస్తుండటం వింతగా ఉంది. నన్ను తిడితే ఏమీ రాదు. నేను ఒకటే పరిష్కారం చెప్తున్నా.. మగ కుక్కలకు స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ శస్త్రచికిత్స) చేయించండి. దీనివల్ల వాటి జనాభా పెరగకుండా ఉంటుంది. ఆరు నెలల్లోనే వాటి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. అన్ని కుక్కలు మంచిగా ఉంటాయనడంలేదు. కొన్ని పిచ్చిగా ఉంటాయి.
అందరం చనిపోతాం
ఆ కొన్నింటి కోసం అన్ని కుక్కల ప్రాణం తీయడం కరెక్ట్ కాదంటున్నాను. మనం ఎలాగో కలియుగం వైపు వెళ్తున్నాము. కుక్కలు పోతాయ్, పిల్లులు పోతాయ్, కోతులు పోతాయ్, అన్ని ప్రాణులు పోతాయి. ఒకరోజు మనం కూడా చనిపోతాం. ప్రభాస్ కల్కి మూవీ చూశారు కదా.. ఎలా ఉంటుందో.. అదే కలియుగం! రాగద్వేషాల్ని పక్కనపెట్టి మానవత్వంతో ముందుకు సాగండి అని రేణూ దేశాయ్ కోరింది.
చదవండి: ఆ రీల్స్ పిల్లలకు చూపించొద్దు: అనిల్ రావిపూడి
Tags : 1