Breaking News

మరో సినిమాకు రేణు దేశాయ్ గ్రీన్ సిగ్నల్.. డైరెక్టర్ ఎవరంటే?

Published on Wed, 11/26/2025 - 17:34

టాలీవుడ్ నటి రేణు దేశాయ్.. రవితేజ మూవీ టైగర్ నాగేశ్వరరావుతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత మరే సినిమాను ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఇటీవల కొద్దికాలంగా ఆధ్యాత్మిక యాత్రలు చేస్తూ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ టచ్‌లో ఉంటోంది. అయితే తాజాగా మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది రేణు దేశాయ్. పదహారు రోజుల పండుగ పేరుతో వస్తోన్న టాలీవుడ్‌ మూవీలో నటించనున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఫన్ బిగిన్స్ అంటూ అనసూయతో ఉన్న ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది .

ఈ మూవీతో నంది అవార్డ్ విన్నర్ సాయి కృష్ణ దమ్మాలపాటి హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. 2008లో నితిన్ హీరోగా వచ్చిన ద్రోణ సినిమాలో నటనకు గానూ సాయికృష్ణ ఉత్తమ బాలనటుడిగా నంది అవార్డ్ అందుకున్నారు. ప్రముఖ సినీ నిర్మాత డీఎ‍స్‌ రావు తనయుడిగా సినిమాల్లో అడుగుపెడుతున్నారు. ఈ మూవీలో గోపికా ఉద్యన్ హీరోయిన్‌గా కనిపించనుంది.‌ ఈ సినిమాకు సాయి కిరణ్‌ అడవి దర్శకత్వం వహిస్తున్నారు. డైరెక్టర్ గతంలో కేరింత, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ లాంటి చిత్రాలను తెరకెక్కించాడు. సురేశ్‌ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతమందించనున్నారు. ఇందులో కృష్ణుడు, వెన్నెల కిషోర్, విష్ణు, అనసూయ భరద్వాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)