Breaking News

ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమా.. తెలుగులో స్ట్రీమింగ్‌

Published on Tue, 02/04/2025 - 08:06

ఈ ఏడాదిలో విడుదలై తొలి విజయాన్ని అందుకున్న మలయాళ సినిమా 'రేఖా చిత్రం' ఓటీటీలోకి రానుంది. మర్డర్ మిస్టరీని పోలీసులు ఎలా ఇన్వెస్టిగేటివ్ చేస్తారు..? అనే కాన్సెప్ట్‌తో ప్రతి సీన్‌ ఆసక్తిగా ఈ మూవీని తెరకెక్కించారు. క్రైమ్ థ్రిల్లర్ జానర్‌లో వచ్చే చిత్రాలు మీకు ఇష్టం అయితే..  'రేఖా చిత్రం'ను చూసేయండి. మిమ్మల్ని ఎక్కడా కూడా నిరుత్సాహపరచదు. ఆసిఫ్ అలీ హీరోగా నటించిన ఈ చిత్రంలో మలయాళ స్టార్‌ మమ్ముట్టి క్యామియో రోల్‌లో కనిపించడం విశేషం. ఈ మూవీకి జోఫిన్ టీ చాకో దర్శకత్వం వహించారు.

జనవరి 9న మలయాళంలో మాత్రమే విడుదలైన  రేఖాచిత్రం. మార్చి 7న ఓటీటీలోకి వచ్చేస్తుంది. సోనీ లివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. ఈ  సినిమాలో ఆసిఫ్ అలీతో పాటు అనస్వర రాజన్, మనోజ్ కే జయన్, సిద్ధిఖీ, జగదీశ్, సాయికుమార్ వంటి వారు నటించారు. కేవలం రూ. 10 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద 25 రోజ్లులోనే రూ. 75 కోట్ల మేరకు కలెక్షన్స్‌ రాబట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసింది.

బాక్సాఫీస్‌ వద్ద ఇంకా థియేటరికల్‌ రన్‌ మంచిగానే కొనసాగుతుంది. అయినప్పటికీ ఓటీటీలో ఈ చిత్రం విడుదల కానున్నడం విశేషం. ఇదొక మర్డర్ మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. కథలో భాగంగా ఒక ఆత్మహత్య కేసును సీఐ వివేక్ గోపీనాథ్ (ఆసిఫ్ అలీ) విచారణ చేపడుతాడు.  గ్యాంబ్లింగ్ స్కామ్ లో దొరికిపోయి సస్పెండ్ అయిన ఈ కేసు కోసం మళ్లీ ఎంట్రీ ఇస్తాడు. ఈ క్రమంలో 40 ఏళ్ల కిందటి హత్య కేసుతో ఈ ఆత్మహత్యకు లింక్‌ ఉందని ఆయన గుర్తిస్తాడు.  1985 సమయంలో ఓ సినిమా షూటింగ్ లొకేషన్ నుంచి  మిస్ అయిన బాలిక కేసును కూడా వివేక్ దర్యాప్తు చేస్తాడు. ఇలా ఒక సంఘటనతో ఎన్నో ట్విస్ట్‌లు వస్తూనే ఉంటాయి. ఫైనల్‌గా చిక్కుముడి లాంటి ఈ కేసులను ఆయన ఎలా ఛేదిస్తాడనేది కీలకంగా ఉంటుంది. పోలీస్‌ ఆఫీసర్‌గా వివేక్ దర్యాప్తు ఎలా ఉంటుందో తెలియాలంటే రేఖాచిత్రం చూడాల్సిందే.

Videos

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)