Breaking News

ప్రేక్షకుల మనసుని హత్తుకుంటాయి: రెజీనా కసాండ్రా

Published on Wed, 09/11/2024 - 00:54

‘‘నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్‌ నాటకాలంటే ఇష్టం. స్కూల్, కాలేజ్‌ డేస్‌లో వేశాను. నాటక రంగంపై పరిశోధన చేసి ‘ఉత్సవం’ కథని రాసుకున్నారు అర్జున్‌ సాయిగారు. ఈ సినిమాలో రంగస్థలం నటుల గురించి చాలా అద్భుతమైన సన్నివేశాలుఉన్నాయి. అవన్నీ ప్రేక్షకుల మనసుని హత్తుకునేలా ఉంటాయి’’ అని హీరోయిన్‌ రెజీనా కసాండ్రా అన్నారు. దిలీప్‌ ప్రకాష్, రెజీనా కసాండ్రా జంటగా అర్జున్‌ సాయి దర్శకత్వం వహించిన చిత్రం ‘ఉత్సవం’. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌పాటిల్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 13న తెలుగు, కన్నడ, హిందీలో విడుదలవుతోంది. తెలుగులో మైత్రీ మూవీస్‌ రిలీజ్‌ చేస్తోంది. ఈ సందర్భంగా రెజీనా కసాండ్రా మాట్లాడుతూ–‘‘ఉత్సవం’లో కార్పోరేట్‌ ఎం΄్లాయ్‌పాత్ర చేశా. 

చాలా స్వతంత్ర భావాలున్న క్యారెక్టర్‌. ఈ క్యారెక్టర్‌ చేయడం చాలా రిఫ్రెషింగ్‌గా అనిపించింది. స్వతంత్ర భావాలున్న మహిళలకు నాపాత్ర నచ్చుతుంది. అలాగని ఇది సందేశాత్మక చిత్రం కాదు.. అన్ని వాణిజ్య అంశాలున్న కథ. దిలీప్‌ ప్రకాష్‌ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ప్రకాష్‌ రాజ్‌గారు, నాజర్‌ గారు థియేటర్‌ ఆర్ట్స్‌ నుంచే వచ్చారు. వారితో వర్క్‌ చేయడం వల్ల చాలా నేర్చుకున్నాను. రసూల్‌గారి అద్భుతమైన విజువల్స్, అనూప్‌ రూబెన్స్గారి చక్కని సంగీతం ఈ సినిమాకి ప్లస్‌ అవుతుంది. నాకంటూ ప్రత్యేకమైన లక్ష్యాలు పెట్టుకోలేదు. నా మొదటి సినిమా ‘ఎస్‌ఎంఎస్‌’ చేసినప్పుడే  వెర్సటైల్‌ నటిగా ఉండాలని భావించాను. అది దూరం కాకుండా ఇన్నాళ్లు వైవిధ్యమైనపాత్రలు చేసుకుంటూ వచ్చాను. ప్రస్తుతం సన్నీ డియోల్‌గారు హీరోగా డైరెక్టర్‌ గోపీచంద్‌ మలినేని తెరకెక్కిస్తున్న ఓ హిందీ సినిమా చేస్తున్నాను. అలాగే మరో రెండు హిందీ చిత్రాలు ఒప్పుకున్నాను’’ అన్నారు.    

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)