Breaking News

నా వయసు, పెళ్లి గురించి మీకెందుకు: రెజీనా

Published on Sat, 07/05/2025 - 11:03

ఈ తరం అమ్మాయిలు పెళ్లి కంటే కెరీర్‌పైనే ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారన్నది కాదనలేని విషయం. ఇంతకు ముందు 16, 18 ఏళ్లకే అమ్మాయిలను పెళ్లీడుకొచ్చారనే వారు. ఇప్పుడు అంతా మారిపోయింది. 21 ఏళ్లు దాటిన తరువాతనే పెళ్లిపై ఆసక్తి చూపుతున్నారు. అయితే సినిమా రంగంలో అయితే 35 దాటిపోతోంది. చాలా మంది హీరోయిన్లు మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌గానే ఉంటున్నారు. అలాంటి వారిలో నటి రెజీనా( Regina Cassandra) ఒకరు. ఈమె బహుభాషా నటి. తమిళం, తెలుగు, కన్నడం భాషల్లో కథానాయకిగా నటించి పాపులర్‌ అయ్యారు. 

ముఖ్యంగా తమిళంలో 2005లో విడుదలైన కండనాళ్‌ మొదల్‌ చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత నటించిన అసుర చిత్రం మంచి పేరు తెచ్చిపెట్టినా, శివకార్తీకేయన్‌కు జంటగా నటించిన కేడీబిల్లా కిల్లాడి రంగా చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఆ తరువాత తెలుగు, కన్నడం భాషల్లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. అయితే కొంత కాలంగా సరైన అవకాశాలు రావడం లేదనే చెప్పాలి. దీంతో ప్రత్యేక పాటల్లో నటించడంతోపాటు ప్రతినాయకి పాత్రల్లో నటించడానికి సై అన్నారు. అదే సమయంలో వెబ్‌ సిరీస్‌లోనూ నటించడం ప్రారంభించారు. ఇలా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటున్న రెజీనా చాలా బోల్డ్‌ నటి అనే ముద్ర వేసుకున్నారు. అందాలారబోతకు నో చెప్పని ఈ భామ వయసు 34 ఏళ్లు. 

ఈమె తమిళంలో చివరిగా నటించిన చిత్రం విడాముయర్చి. అందులో నెగిటీవ్‌ పాత్రలో నటించారు. కాగా ఇటీవల ఒక భేటీలో 34 ఏళ్లు వచ్చాయి. పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు ముక్కు సూటిగా బదులిచ్చిన రెజీనా పెళ్లెప్పుడు చేసుకుంటావని తన తల్లే అడగదని, మీరెందుకు అడుగుతున్నారు? మీకెందుకు అంత అక్కర అని చెప్పింది. అంతే కాకుండా తనతో ఎవరైనా సంబంధం పెట్టుకుంటే వారికే కష్టం అనీ, అందుకే ఫ్రెండ్‌షిపే బెటర్‌ ఈజీగా ఉంటుందని చెప్పారు. దీంతో నెటిజన్లు ఈ అమ్మడిపై రకరకాల ట్రోల్స్‌ చేస్తున్నారు.అసలు జీవితంలో పెళ్లి చేసుకుంటారా? లేక అవివాహితగానే ఉండిపోతారా? అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. 

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)