Breaking News

హీరో ధనుష్‌కి రెడ్ కార్డ్.. అతడి సినిమాలపై నిషేధం?

Published on Sun, 07/02/2023 - 07:18

'సార్' హీరో ధనుష్‌కి షాక్ తగిలేలా కనిపిస్తుంది. తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు వాళ్లకు బాగా దగ్గరైన ఇతడు.. ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాల్లోనూ నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక్కడ ఓ చిక్కొచ్చి పడింది. తమిళ నిర్మాతల మండలి అతడికి రెడ్ కార్డ్ ఇవ్వడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ధనుష్‪‌తోపాటు అతడి చిత్రాలపై నిషేధం గ్యారంటీ. అసలేమైంది? రెడ్ కార్డ్ అంటే ఏంటి?

ఏం జరిగింది?
దాదాపుగా 20 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న ధనుష్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. అయితే గతంలో శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో సినిమా చేస్తానని మాటిచ్చాడు. అడ్వాన్స్ తీసుకున్నాడు. ఇది జరిగి చాలా ఏళ్లవుతుంది. కానీ సినిమా మాత్రం చేయట్లేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ.. తమిళ నిర్మాతల మండలిని ఆశ్రయించింది. ఇలా ఆలస్యం చేస్తున్నందుకుగానూ ధనుష్ కి రెడ్ కార్డ్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: అక్కడ ప్లేట్స్ కడిగిన స్టార్ హీరోయిన్.. కారణం అదే!)

రెడ్ కార్డ్ ఇస్తే?
ధనుష్ లానే పలు నిర్మాణ సంస్థల దగ్గర అడ్వాన్స్ లు తీసుకుని సినిమాలు చేయడం లేదనే కారణంతో హీరోలు శింబు, విశాల్, ఎస్జే సూర్య, అథర్వతో పాటు కమెడియన్ యోగిబాబుకి తమిళ నిర్మాతల మండలి రెడ్ కార్డ్ ఇవ్వనుందనే సమాచారం ఈ మధ్యే బయటకొచ్చింది. ఒకవేళ ఇది జారీ చేస్తే.. ఏ దర్శకనిర్మాతలు వీళ్లతో సినిమా చేయడం కుదరదు. ఒకరకంగా చెప్పాలంటే వీళ్లపై నిషేధం విధించినట్లే. గతంలో డైరెక్టర్ శంకర్ తో ఇలాంటి వివాదం కారణంగానే కమెడియన్ వడివేలు.. ఏళ్లపాటు సినిమాలకు దూరమయ్యాడు.

ధనుష్ ఏం చేస్తున్నాడు?
ఈ ఏడాది తెలుగులో 'సార్'తో ఎంట్రీ ఇచ్చి మిక్స్ డ్ టాక్ అందుకున్న ధనుష్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. మరోవైపు 'మిల్లర్' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్నాడు. ఇది మూడు భాగాల ఫ్రాంచైజీగా తీస్తున్నారు. తొలి భాగం త్వరలో విడుదల కానుంది. మరోవైపు కొన్నిరోజుల ముందే బాలీవుడ్ లోనూ ఓ చిత్రం ఒప్పుకొన్నాడు. ఒకవేళ రెడ్ కార్డ్ ఇస్తే మాత్రం ఈ సినిమాల రిలీజ్ చేయడానికి వీలు లేకుండా పోతుంది!

(ఇదీ చదవండి: మెగాడాటర్ నిహారిక భర్త సంచలన పోస్ట్!)

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)