Breaking News

వెయిటింగ్‌ ఇజ్ ఓవర్.. ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ' ట్రైలర్ వచ్చేసింది

Published on Mon, 06/10/2024 - 19:18

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన  తాజా చిత్రం 'కల్కి 2898 ఏడీ'. ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్షన్‌లో తెరకెక్కించారు. ఈ సినిమాను వైజయంతి మూవీస్‌ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రంలో దీపికా పదుకొణె, అమితాబ్‌ బచ్చన్, కమల్ హాసన్, దిశా పటానీ లాంటి సూపర్ స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్‌, బుజ్జి టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశాయి. ఇటీవలే భారీస్థాయిలో ఈవెంట్‌ నిర్వహించిన మేకర్స్‌.. బుజ్జిని ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. అయితే ఈ మూవీ ట్రైలర్‌ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఎప్పుడెప్పుడా అని రెబల్ ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తోన్న కల్కి 2898ఏడీ ట్రైలర్‌ రానే వచ్చింది. ఇవాళ కల్కి ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్‌ చూస్తే యంగ్‌ రెబల్ స్టార్‌ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్‌ తెప్పించేలా ఉంది. మీరు కూడా కల్కి ట్రైలర్‌ను చూసేయండి. కాగా.. ఈ సినిమా జూన్ 27న థియేటర్లలో సందడి చేయనుంది. 
కాగా.. 3 నిమిషాల నిడివితో ఉన్న కల్కి ట్రైలర్‌ రెబల్‌ ఫ్యాన్స్‌ను ఊపేస్తోంది. అభిమానుల భారీ అంచనాల మధ్య రిలీజైన ట్రైలర్‌లో బ్యాగ్‌గ్రౌండ్‌ మ్యూజిక్, విజువల్ ఎఫెక్ట్స్‌ ఆకట్టుకుంటున్నాయి. కాగా.. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 100కు పైగా థియేటర్స్‌లో కల్కి ట్రైలర్ ప్రదర్శించారు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై, తిరువనంతపురం, నార్త్  ఇండియా మెయిన్ సిటీస్‌లోని థియేటర్స్‌లో కల్కి ట్రైలర్‌ను ప్రదర్శించారు.
 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)