Breaking News

నటుడు సుధీర్‌ ఆత్మహత్యకు గల కారణాలు ఇవేనా?

Published on Tue, 01/24/2023 - 13:00

టాలీవుడ్‌ యంగ్‌ హీరో సుధీర్‌ వర్మ ఆత్మహత్యతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.  ‘సెకండ్‌ హ్యండ్‌’, ‘కుందనపు బొమ్మ వంటి’, ‘షూటౌట్‌ ఎట్‌ ఆలేరు’ వంటి పలు సినిమాలతో ఆకట్టుకున్న సుధీర్‌ వర్మ సూసైడ్‌కు కారణాలు ఏంటన్నది పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈనెల18న సుధీర్‌ వర్మ పాయిజన్‌ తీసుకున్నాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడ్ని గుర్తించిన స్నేహితుడు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం సుధీర్‌ను విశాఖలోని ఎల్‌. జీ. ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స తీసుకుంటూనే పరిస్థితి విషమించి సుధీర్‌ మరణించాడు. పోస్టుమార్టం రిపోర్డులోనూ విషం తీసుకోవడం వల్ల మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. హీరోగా ఎంతో భవిష్యత్తు ఉన్న సుధీర్‌  ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటన్నది విచారించగా.. అతడి స్నేహితుడు మాట్లాడుతూ.. సుధీర్‌ చాలా మంచి వ్యక్తి అని, అయితే చాలా సున్నిత మనస్కుడని తెలిపాడు.

తండ్రి మరణం తర్వాత తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడని పేర్కొన్నారు. అంతేకాకుండా కొన్నాళ్లుగా సుధీర్‌ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు తెలిపారు. ఆ కారణంగానే సుధీర్‌ ఆత్మహత్యకు పాల్పడినట్లు స్నేహితులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఇంత చిన్న వయసులో సుధీర్‌ బలవన్మరణానికి పాల్పడటం అందరినీ కలచి వేస్తోంది. 

Videos

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)