Breaking News

దేవుడిని నమ్మని రవితేజకు దేవుడి వల్లే హిట్

Published on Mon, 08/24/2026 - 11:21

దేవుడు అంటే నమ్మేవాళ్లు ఉన్నట్లే.. నమ్మని వాళ్లు కూడా ఉంటారు. ఎవరి నమ్మకాలు వాళ్లవి. అయితే కొన్నిసార్లు డెస్టినీ చాలా చిత్రంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి ఓ సీన్ రిపీటైంది. అసలు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేని రవితేజకు అదే దేవుడి వల్ల దాదాపు నాలుగేళ్ల తర్వాత హిట్ దక్కింది. ఇప్పుడీ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: ‘ఇరుముడి’మూవీ రివ్యూ)

రవితేజ హీరోగా చేసిన లేటెస్ట్ సినిమా 'ఇరుముడి'. తండ్రీకూతురు సెంటిమెంట్‌కి అయ్యప్ప స్వామి నేపథ్యాన్ని జోడించి తీశారు. ఓ మాదిరి అంచనాలతో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ఊహించిన దానికంటే అద్భుతమైన స్పందన అందుకుంటోంది. తెలుగు రాష్ట్రాల్లో పల్లెలు, నగరాలు అనే తేడా లేకుండా జనాలు తెగ చూస్తున్నారు.

అయితే సినిమాలో కూతురి సెంటిమెంట్ ఎంతలా ఆకట్టుకుంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మూవీలో చివరి అరగంట చాలామంది ప్రేక్షకుల్ని ఏడిపించేసింది. అదే టైంలో అయ్యప్ప స్వామి నేపథ్యం, రెండు పాటలు కూడా మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అయ్యప్ప మాలలో రవితేజ చాలా సహజంగా కనిపించాడు. చాలామంది అయ్యప్ప భక్తులు తమని తాము ఇందులో చూసుకున్నారంటే అతిశయోక్తి లేదు.

అయితే 'ఇరుముడి'లో అయ్యప్ప భక్తుడిగా ఆకట్టుకున్న రవితేజ.. నిజజీవితంలో దేవుడిని పెద్దగా నమ్మడు. ఈ విషయాన్ని ఇతడే స్వయంగా చెప్పాడు. మూడేళ్ల క్రితం 'టైగర్ నాగేశ్వరరావు' మూవీ రిలీజ్ టైంలో హిందీలో ఓ యూట్యూబర్‌కి రవితేజ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే మాట్లాడుతూ.. 'రోజూ పూజ చేయడం, దేవుడి ప్రతిమలని ఆరాధించడం లాంటి వాటిని నేను నమ్మను. ప్రకృతే నాకు దేవుడితో సమానం' అని రవితేజ అన్నాడు. ఇప్పుడు అదే రవితేజ 'ఇరుముడి' అనే భక్తి చిత్రంతో నాలుగేళ్ల తర్వాత ఓ సక్సెస్ అందుకోవడం డెస్టినీ(విధి) అనుకోవాలేమో!

(ఇదీ చదవండి: 'ఇరుముడి'తో జాక్‌పాట్ కొట్టిన రవితేజ)

Videos

అదిగో నా కోడలు.. వసంత కృష్ణ ప్రసాద్ ఆఫీస్ వద్ద.. సంచలన వీడియో బయటపెట్టిన జోగి రమేష్

ఎగసిపడుతున్న అలలు.. ఉత్తరాంధ్రకు భారీ వర్ష సూచన

భారీగా పెరిగిన బంగారం ధర

Watch Live: కొడుకు వివాదంపై జోగి రమేష్ సంచలన ప్రెస్ మీట్

కలిసొచ్చిన సెంటిమెంట్.. రవితేజ సక్సెస్ సీక్రెట్ ఇదే.!

నెల్లూరు జిల్లాలో గుప్తనిధుల తవ్వకాల కలకలం

భగ్గుమన్న బియ్యం ధరలు.. చోద్యం చూస్తున్న బాబు సర్కార్

కాకినాడ రూరల్ PS కు సాధిక్ ఖాన్ తరలింపు

దొరికిన ఇద్దరు వీడియో.. ఈశ్వర్ సాయి ఫస్ట్ రియాక్షన్

లింగమనేని కొడుకు వీడియో తీసింది ఎవరంటే.. అది బయటపడటానికి కారణం కూడా..

Photos

+5

హీరోయిన్ కృతిసనన్ హ్యాపీ మూమెంట్స్ (ఫొటోలు)

+5

ఇన్నాళ్లకు మళ్లీ ఓకే వేదికపై..(ఫోటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ హీరోయిన్‌ ప్రిషా సింగ్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ బ్యూటీ కిర్రాక్ సీత వరలక్ష్మీ వ్రతం పూజలు.. (ఫోటోలు)

+5

నటి రాధిక బర్త్‌ డే సెలబ్రేషన్స్.. సీనియర్ హీరోయిన్ల సందడి (ఫోటోలు)

+5

టాక్సిక్ ఈవెంట్.. స్పెషల్ ‍అట్రాక్షన్‌గా కియారా అద్వానీ (ఫోటోలు)

+5

గిరిజన తండాల్లో యువతుల సందడే సందడి (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా మార్వాడీల 'కావడి యాత్ర' (ఫొటోలు)

+5

టాక్సిక్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ఫోటోలు

+5

ఫ్రెండ్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఆనంది..(ఫోటోలు)