Breaking News

'మిస్టర్ బచ్చన్' ఓటీటీ పార్ట్‌నర్ ఫిక్స్.. ఎప్పుడు రావొచ్చు?

Published on Thu, 08/15/2024 - 10:17

రవితేజ లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' థియేటర్లలోకి వచ్చేసింది. చాలా నమ్మకంతో ముందు రోజే ప్రీమియర్లు వేశారు కానీ టాక్ అయితే పాజిటివ్‌గా రాలేదు. రవితేజ ఎనర్జీ, కొత్తమ్మాయి భాగ్యశ్రీ గ్లామర్ పరంగా ఏ లోటు లేనప్పటికీ మిగతా విషయాలు పరమ రొటీన్‌గా ఉన్నాయని చూసిన వాళ్లు అంటున్నారు. ఇకపోతే ఈ సినిమా ఓటీటీ పార్ట్‌నర్ ఎవరనేది కూడా తేలిపోయింది.

(ఇదీ చదవండి: ‘మిస్టర్‌ బచ్చన్‌’ మూవీ రివ్యూ)

2018లో హిందీలో వచ్చిన సినిమా 'రైడ్'. ఓ సాధారణ ఇన్‍‌కమ్ ట్యాక్స్ ఆఫీసర్.. పలుకుబడి ఉన్న పెద్ద మనిషి ఇంటిపై రైడ్ చేసి ఎలా చెమటలు పట్టించాడనేదే స్టోరీ. దీనికి కాస్త ఎంటర్‌టైన్‌మెంట్ , రవితేజ మార్క్ వినోదం జోడించి తీసిన తెలుగు సినిమా 'మిస్టర్ బచ్చన్'. హీరోయిన్‌గా చేసిన భాగ్యశ్రీ గ్లామర్, డ్యాన్సుల వల్ల కాస్త హైప్ పెరిగింది. కానీ ఈ అంచనాల్ని మూవీ అందుకోలేకపోయిందని అంటున్నారు.

ఇకపోతే 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ హక్కుల్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. రీసెంట్ టైంలో ఈ ఓటీటీలో వచ్చిన మూవీస్ అన్నీ థియేటర్లలో రిలీజైన 28 రోజుల తర్వాత వచ్చేస్తున్నాయి. బచ్చన్ కూడా నాలుగు వారాల్లోనే స్ట్రీమింగ్ అయ్యే అవకాశాలున్నాయి. అంటే సెప్టెంబరు రెండో వారంలో ఓటీటీలోకి వచ్చే ఛాన్స్ ఉంది. అంతకంటే ముందే వచ్చినా సరే ఆశ్చర్యపోనక్కర్లేదు.

(ఇదీ చదవండి: ఈ వీకెండ్ ఓటీటీల్లోకి 18 సినిమాలు.. ఆ మూడు స్పెషల్)

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)