అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్
Breaking News
రావణాసుర నుంచి లీకైన వీడియో, రవితేజ నోట అభ్యంతరకర డైలాగ్!
Published on Thu, 04/06/2023 - 20:02
మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం రావణాసుర. సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో దక్షా నగార్కర్, అను ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాశ్, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ హీరోయిన్స్గా నటిస్తున్నారు. అభిషేక్ నామా, రవితేజ నిర్మించారు. రేపు(ఏప్రిల్ 7న) ఈ సినిమా విడుదల కానున్న నేపథ్యంలో రావణాసుర నుంచి ఓ డైలాగ్ వీడియో లీకైంది.
ఇందులో రవితేజ.. కంచం ముందుకి, మంచం మీదకి ఆడపిల్లలు పిలవంగనే రావాలి.. లేకపోతే నాకు మండుద్ది అని రాక్షసంగా డైలాగ్ చెప్పాడు. ఈ డైలాగ్ అభ్యంతరకరంగా ఉందని నెటిజన్లు మండిపడుతున్నారు. రవితేజ ఫ్యాన్స్ మాత్రం.. రావణాసుర అంటే ఆ మాత్రం ఉంటుంది. నెగెటివ్ షేడ్కు తగ్గట్లు డైలాగ్ లేకపోతే ఎలా? అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా ఈ డైలాగ్ వీడియో మాత్రం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Tags : 1