Breaking News

విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే!

Published on Fri, 06/06/2025 - 08:13

కోలీవుడ్‌ జంట రవి (Jayam Ravi)- ఆర్తి విడాకులు దాదాపు ఖరారైనట్లే! మూడో వ్యక్తి ప్రమేయం వల్లే విడిపోవాల్సి వస్తోందని ఆర్తి భర్తపై సంచలన ఆరోపణలు చేసింది. అయితే ఆ మూడో వ్యక్తి మరెవరో కాదని, సింగర్‌ కెనీషా అన్న ప్రచారం మొదలైంది. రవి.. సింగర్‌ కెనీషా (Keneeshaa)తో ప్రేమలో ఉన్నాడని చాలాకాలంగా ప్రచారం జరుగుతోంది. తాజాగా వీరిద్దరూ పూలదండలతో ఉన్న ఫోటో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది.  

పూలదండలతో కోలీవుడ్‌ జంట
ఇది చూసిన నెటిజన్లు అదేంటి? అప్పుడే వీరి పెళ్లి జరిగిపోయిందా? అని షాకవుతున్నారు. అసలు విషయమేంటంటే.. తమిళనాడులోని కాంచీపురంలో ఉన్న కుండ్రతుర్‌ మురుగన్‌ దేవాలయాన్ని రవి, కెనీషా సందర్శించారు. దర్శనం అనంతరం అర్చకులతో కలిసి ఇలా ఫోటో దిగారు. జయం సినిమాతో రవి విపరీతమైన గుర్తింపు సంపాదించుకున్నాడు. ఈ చిత్రంతోనే అతడు జయం రవిగా స్థిరపడిపోయాడు. కానీ ఇటీవలే తనను జయం రవి అని పిలవొద్దని కేవలం రవి అని మాత్రమే పిలవాలని సూచించాడు. 

15 ఏళ్ల బంధానికి ఫుల్‌స్టాప్‌!
ఇకపోతే ఇతడు నిర్మాత సుజాత విజయకుమార్‌ కూతురు ఆర్తిని 2009లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు సంతానం. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట మధ్య ఇటీవల భేదాభిప్రాయాలు తలెత్తాయి. దీంతో 15 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు చెన్నై ఫ్యామిలీ కోర్టులో నడుస్తోంది. తనకు భర్త నుంచి నెలకు రూ.40 లక్షల భరణం కావాలని డిమాండ్‌ చేస్తోంది.

చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది..: హీరో

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)