Breaking News

జయం రవితో విడాకుల వివాదం.. ఆర్తి తొలిసారి ఎమోషనల్ పోస్ట్!

Published on Tue, 07/08/2025 - 21:54

కోలీవుడ్ హీరో జయం రవి విడాకుల వివాదం గత కొద్దికాలంగా హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. దాదాపు 16 ఏళ్ల వివాహాబంధానికి ముగింపు పలికేందుకు వీరిద్దరు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని గతేడాది చివర్లో సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు జయం రవి. ఆ తర్వాత ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నారు. తాము విడిపోవడానికి కారణం మూడో వ్యక్తేనని ఆయన భార్య ఆర్తి ఆరోపించింది. పరోక్షంగా సింగర్ కెన్నీషాను ఉద్దేశించి విమర్శలు చేసింది. ప్రస్తుతం విడాకుల వ్యవహారం కోర్టులో ఉండడంతో కోర్టు విచారణకు హాజరవుతున్నారు.

అయితే తాజాగా జయం రవి భార్య ఆర్తి చేసిన ఇన్‌స్టా పోస్ట్ వైరల్‌గా మారింది. తన పిల్లలతో కలిసి ఉన్న ఫోటోలను పంచుకుంది. నా చుట్టూ ఉన్న ప్రతిదీ పెరుగుతూనే ఉంది అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఇద్దరు పిల్లలు, పెట్‌ డాగ్‌తో ఉన్న వరుస ఫోటోలను షేర్ చేసింది.  కొన్ని హృదయాలకు ఎక్కడ ఉండాలో తెలుసంటూ రాసుకొచ్చింది.

ఆర్తి తన ఇన్‌స్టాలో రాస్తూ.. "కొన్ని సాయంత్రాలు, కొన్ని పెరుగుతున్న విషయాల మధ్య సూర్యాస్తమయం.. గట్టిగా పట్టుకునే రెండు చేతులు.. ఎలాంటి మాటలు లేకున్నా దగ్గరగా ఉండే హృదయం.. ప్రతిదీ సంపూర్ణంగా అనిపించేలా చేసే నిశ్శబ్ద ప్రేమ ' అంటూ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్‌ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. జయం రవితో విడాకుల వివాదం ప్రేమ, హృదయం అంటూ భావోద్వేగ పోస్ట్ చేసింది. ఇది చూసిన హీరోయిన్ త్రిష కృష్ణన్ కూడా స్పందించింది. చాలా అందంగా ఉంది.. ఆర్తు అంటూ కామెంట్ చేసింది. కాగా.. 16 ఏళ్ల క్రిత రవి, ఆర్తి పెళ్లి చేసుకోగా..వీరికి ఇద్దరు కుమారులు ఆరవ్, అయాన్ ఉన్నారు.

 

 

Videos

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)