Breaking News

చిన్నగదిలో బతికా.. నాన్న కూడా అవమానించారు: రేసుగుర్రం నటుడు

Published on Sun, 11/24/2024 - 17:01

తెలుగు ప్రేక్షకులకు మద్దాలి శివారెడ్డిగా పరిచయమైన నటుడు రవికిషన్. అల్లు అర్జున్‌ మూవీ రేసుగుర్రంతో టాలీవుడ్‌ ప్రియులను అలరించాడు. తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అయితే ఈ ఏడాది అమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు తెరకెక్కించిన లపట్టా లేడీస్‌ చిత్రంలో కీలక పాత్ర పోషించారు. ఈ మూవీ పోలీసు అధికారి పాత్రలో నటించారు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన రవికిషన్ తన కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన చిన్నతనంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నట్లు తెలిపారు. దాదాపు 34 ఏళ్లపాటు పోరాటం చేశానని వెల్లడించారు. ఇప్పుడు మీరు చూస్తున్న రవికిషన్ వెనుక ఎంతో కృషి దాగి ఉందని వివరించారు.

రవికిషన్ మాట్లాడుతూ.. 'నేను పూజారి కొడుకుని. నాకు మా నాన్న ఆధ్యాత్మికత, నిజాయితీ గురించి మాత్రమే నేర్పారు. నేను థియేటర్‌లో ఉండేవాడిని. నా చిన్నతనంలోనే రామ్ లీలాలో సీత పాత్రలో నటించా. దీంతో నాన్న నన్ను కొట్టారు. ఆ తర్వాత కోపంతో నువ్వు నర్తకి అవుతావని ఎగతాళి చేశారు. కానీ సినిమాల్లోకి రావడానికి చాలా ఇబ్బందులు పడ్డా. ముంబయిలో చెప్పుల్లేకుండా నడిచా. చిన్నరూమ్‌లో ఉండేవాడిని. నాకు గాడ్‌ఫాదర్‌ ఎవరూ  లేరు. కానీ నా జీవితంలో మంచి రోజులు వస్తాయని మాత్రం తెలుసు' అని అన్నారు.

తాను తెలుగు, హిందీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయని రవికిషన్ తెలిపారు. అలాగే మీరు నన్ను బుల్లితెరపై కూడా చూస్తారని అన్నారు. నటనలో సహజత్వాన్ని తీసుకురావాలని ఎప్పుడూ కోరుకుంటానని పేర్కొన్నారు. అజయ్ దేవగన్, అక్షయ్ కుమార్ 90వ దశకంలో వచ్చారని.. నా ప్రయాణం మొదలైంది కూడా అప్పుడేనని వెల్లడించారు. కానీ వారి జీవితాల్లో త్వరగా ఎదిగారని.. వారిలా ఉన్నతస్థాయికి చేరుకునేందుకు కృషి చేస్తున్నట్లు రవికిషన్‌ తెలిపారు. కాగా.. ఆయన నటించిన లపట్టా లేడీస్‌ ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే.
 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)