Breaking News

పెళ్లి తర్వాత మరో నటితో ఎఫైర్‌?.. స్పందించిన నటుడు

Published on Sun, 04/02/2023 - 08:00

ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ పరిచయం అక్కర్లేని పేరు. రేసు గుర్రం సినిమాతో టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్నారు.‌ మద్దాలి శివారెడ్డి పాత్రతో తెలుగు వారికి దగ్గరయ్యారు. ప్రస్తుతం ఆయన గోరఖ్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే ఇటీవల ఆప్ కీ అదాలత్ షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా అతనికి ఓ క్లిష్టమైన ప్రశ్న ఎదురైంది. సీనియర్ నటి నగ్మాతో మీకు ఎఫైర్‌ ఉండేదా? అని ప్రశ్నించారు. దీంతో ఆయన స్పందించారు. అయితే ఆమెతో ఎక్కువ సినిమాలు చేయడం వల్లే అలా రూమర్స్ సృష్టించారని చెప్పుకొచ్చారు. 

రవి మాట్లాడుతూ, 'నగ్మాతో చాలా సినిమాలు చేశా. మా సినిమాలు బ్లాక్‌ బస్టర్లుగా కూడా నిలిచాయి. అయితే మేము మంచి స్నేహితులం కాబట్టి ఎక్కువ సినిమాలు చేసేవాళ్లం. మరీ ముఖ్యంగా నాకు పెళ్లి అయిన విషయం అందరికీ తెలుసు. నేను నా భార్య ప్రీతి శుక్లాను చాలా గౌరవిస్తా. నేను ఆమె పాదాలకు నమస్కరిస్తా. నా భార్య మొదటి నుంచి నాతోనే ఉంది. నా వద్ద డబ్బు లేనప్పుడు కూడా ఆమె నాతో ఉంది' అని అన్నారు. అయితే తాను సూపర్‌స్టార్‌ అయ్యాక అహంకారం ప్రదర్శించానని.. ఆ తర్వాత తనను బిగ్‌బాస్‌లో పాల్గొనాల్సిందిగా భార్య సూచించిందని రవి తెలిపారు. 

రవికిషన్ మాట్లాడుతూ.. 'నా సినిమాలు సూపర్ హిట్ కావడంతో ఆ తర్వాత నేను కాస్తా గర్వం ప్రదర్శించా. దీంతో వెంటనే నా భార్య బిగ్ బాస్‌కు వెళ్లమని సలహా ఇచ్చింది. మొదట ఇష్టం లేకపోయినా సరే తర్వాత వెళ్లాను. మూడు నెలల పాటు హౌస్‌లో ఉన్నా. బయటకు వచ్చేసరికి నాలో చాలా మార్పు వచ్చింది. నేను పాపులర్ అవ్వడమే కాకుండా సాధారణ వ్యక్తిగా మారిపోయా. ఆ తర్వాత నా కుటుంబాన్ని, నా భార్య, పిల్లలను బాగా చూసుకున్నా.'  అని రవికిషన్ వెల్లడించారు.

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి