Breaking News

ప్రియుడితో శ్రద్ధా.. సీక్రెట్‌ వీడియో వైరల్‌.. ఇంత పని చేస్తారనుకోలేదన్న రవీనా

Published on Thu, 07/10/2025 - 12:42

సెలబ్రిటీలకు కనీస ప్రైవసీ లేకుండా పోతోంది. వాళ్లు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఎవరో ఒకరు వారిని వెంబడిస్తూనే ఉన్నారు. కెమెరాల కళ్లు గప్పి ఫ్రెండ్స్‌తో లేదా బాయ్‌ఫ్రెండ్‌తో ఎక్కడికైనా వెళ్దామా? అంటే అక్కడ కూడా ఎవరో ఒకరు ఈ జంటను కనిపెట్టి ఫోన్‌లో ఫోటోలు, వీడియోలు రికార్డ్‌ చేస్తున్నారు. బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్ధా కపూర్‌ (Shraddha Kapoor) విషయంలో ఇదే జరిగింది.

సీక్రెట్‌గా వీడియో
శ్రద్ధా, ప్రియుడు రాహుల్‌ మోదీతో కలిసి విమానంలో ప్రయాణించింది. వీరిద్దరూ ఎకానమీ క్లాసులో కూర్చోగా శ్రద్ధా తన ఫోన్‌లో ఏదో రాహుల్‌కు చూపిస్తోంది. దీన్నంతటినీ విమాన సిబ్బంది ఒకరు సీక్రెట్‌గా వీడియో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో వదిలారు. ఐదు నెలల క్రితం జరిగిన సంఘటన ఇది. ఏమైందో, ఏమో కానీ తాజాగా మరోసారి ఈ వీడియో నెట్టింట వైరలవుతోంది. 

రవీనా టండన్‌ ఫైర్‌
ఇండియా ఫోరమ్స్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీలో ప్రత్యక్షమైన ఈ వీడియో హీరోయిన్‌ రవీనా టండన్‌ (Raveena Tandon) కంటపడింది. అంతే విమాన సిబ్బందిని ఏకిపారేస్తూ సదరు పోస్ట్‌ కింద కామెంట్‌ పెట్టింది. ఇలా రహస్యంగా వీడియో రికార్డ్‌ చేయడమనేది వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించడమే అవుతుంది. ఈ విషయం సిబ్బందికి తెలిసే ఉంటుంది. ముందు వారి అనుమతి తీసుకుని ఆ తర్వాత వీడియో రికార్డ్‌ చేసుకోవాల్సింది. 

ఇంట్లోకి చొరబడి తీసిందా?
ఎయిర్‌లైన్‌ స్టాఫ్‌ కూడా ఇలా చేస్తారని అస్సలు ఊహించలేదు అని మండిపడింది. కొందరు ఆమె మాటలతో ఏకీభవిస్తూ.. సెలబ్రిటీలు కూడా మనుషులేనని, వారికి కొంత ప్రైవసీ ఇవ్వాలని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో.. వాళ్లకు లేని ఇబ్బంది మీకెందుకు? ఆమె సెలబ్రిటీ ఇంట్లోకి చొరబడి వీడియో తీయలేదు కదా.. విమాన సిబ్బందిని తిట్టాల్సిన అవసరం లేదు, వారు కూడా మనుషులే అంటూ ఘాటుగా రియాక్ట్‌ అవుతున్నారు.

 

 

చదవండి: 'ఐ లవ్‌ యూ' చెబితే ఓకే చెప్పేశాను: అనుష్క

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)