Breaking News

బంగారాన్ని బహుమతిగా ఇచ్చేసిన నటి.. నోరెళ్లబెట్టిన కూతురు

Published on Thu, 03/06/2025 - 21:31

ఎవరైనా మీ ఇయర్‌ రింగ్స్‌ బాగున్నాయనో, బ్యాగు బాగుందనో, నెక్లెస్‌ బాగుందనో చెప్తే థాంక్స్‌ అంటూ సంతోషిస్తారు. కానీ ఈ బాలీవుడ్‌ నటి మాత్రం బంగారు దిద్దులు బాగున్నాయన్నందుకు ఏకంగా వాటినే తీసి బహుమతిగా ఇచ్చేసింది. ఇంతకీ ఆ నటి ఎవరో కాదు ఒకప్పటి హీరోయిన్‌ రవీనా టండన్‌ (Raveena Tandon). రవీనా తన కూతురు రాషా తడానీతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో బుధవారం సాయంత్రం ప్రత్యక్షమైంది. ఆమె కనిపించగానే ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు తనను వెంబడిస్తూ కెమెరాలో రికార్డు చేస్తున్నారు.

బంగారు కమ్మ బహుమతిగా..
వారిలో ఒకరు రవీనాను తన చెవిదిద్దులు బాగున్నాయని పొగిడాడు. దాంతో రవీనా ఏ కమ్మ బాగుందని అడుగుతూ దాన్ని తీసేసింది. తనకు కాంప్లిమెంట్‌ ఇచ్చిన వ్యక్తిని ఆ బంగారు దిద్దును బహుమతిగా ఇచ్చేసింది. ఇదంతా చూసిన రాహా.. తల్లి చేసిన పనికి నోరెళ్లబెట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. రవీనా మనసు బంగారం.. ఈ రోజుల్లో బంగారాన్ని దానం చేసే మహానుభావులు ఎవరున్నారు? వావ్‌, మంచి మనసున్నవాళ్లకే ఇలాంటివి సాధ్యమవుతాయి.. తను నిజంగా గ్రేట్‌ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

రెండు గాజులు గిఫ్ట్‌గా..
రవీనా ఇలా తన ఆభరణాలను బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో ఓ పెళ్లికి హాజరైన ఆమె పెళ్లికూతురికి తన గాజుల్ని గిఫ్ట్‌గా ఇచ్చింది. అవి సాధారణ బ్యాంగిల్స్‌ కావు. వాటిపై రవీనా పేరుతో పాటు ఆమె భర్త అనిల్‌ పేరు కూడా రాసి ఉంది. అయినా అవేమీ పట్టించుకోకుండా వాటిని కొత్త జంటకు కానుకగా ఇచ్చేసింది. ఆమె సినిమాల విషయానికి వస్తే వెల్‌కమ్‌ టు ద జంగిల్‌ సినిమా చేస్తోంది. అనీస్‌ బజ్మీ డైరెక్ట్‌ చేస్తున్న ఈ మూవీలో అక్షయ్‌ కుమార్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌, సంజయ్‌ దత్‌, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

 

 

చదవండి: ఆ డైరెక్టర్‌ వల్ల బతకొద్దనుకున్నా.. సింగపూర్‌లో 13 ఏళ్లు టీచర్‌గా..: హిట్లర్‌ నటి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)