Breaking News

ఆ హీరో మేనల్లుడితో స్టార్ హీరోయిన్ కుమార్తె ఎంట్రీ..!

Published on Fri, 01/20/2023 - 16:09

రవీనా టాండన్ బాలీవుడ్‌ ప్రముఖ  హీరోయిన్లలో ఒకరు. 1990ల్లో అభిమానుల్లో సుస్థిర స్థానం సంపాదించకున్న నటి ప్రస్తుతం బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. కన్నడ స్టార్ యశ్ నటించిన కేజీఎఫ్ చిత్రంతో దక్షిణాది ప్రేక్షకులను అలరించింది రవీనా టాండన్. తాజాగా ఆమె కూతురు రాషా తడాని సైతం బాలీవుడ్ ఎంట్రీకి సిద్ధమైంది.

(ఇది చదవండి: అందరి కళ్లు దీపికా పదుకొణె వైపే.. ఆ శారీ అన్ని లక్షలా?)

అజయ్ దేవగణ్ మేనల్లుడు అమన్‌ దేవగణ్‌కు జంటగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత అభిషేక్ కపూర్ నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రానికి రాషా ఇప్పటికే సంతకం చేశారు. ఈ చిత్రంలో అజయ్ దేవ్‌గణ్‌ మునుపెన్నడూ కనిపించని పాత్రలో నటిస్తున్నారు. అయితే బాలీవుడ్‌లో ఇప్పుడు అందరి దృష్టి రాషా పైనే ఉంది. రవీనా టాండన్‌ కూతురిగా సినిమాల్లో ఎలా రాణిస్తుందనే దానిపై చర్చ నడుస్తోంది. 

నిర్మాత అభిషేక్ కపూర్ గురించి ఓ వ్యక్తి మాట్లాడుతూ.. 'గత 15 ఏళ్లుగా భారతీయ సినిమాకి అభిషేక్ అందించిన సహకారం ప్రశంసనీయం. అతను సుశాంత్ సింగ్ రాజ్‌పుత్, ఫర్హాన్ అక్తర్, రాజ్‌కుమార్ రావు, సారా అలీ ఖాన్ లాంటి కొత్త వ్యక్తులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ప్రతి సినిమాలో వారి పాత్రలను అందించాడు. ఆ సినిమాలు మనతో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఆ పాత్రలు ఈ నటీనటుల జీవితాల్లో అద్భుతాలుగా నిలిచాయి. భారతీయ సినిమాకు, ఆయన ప్రగతిశీల ఆలోచనకు ఇది సంకేతం.' అని అన్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)