Breaking News

హీరోయిన్‌ పవిత్ర స్నానం చేస్తుంటే.. నవ్వులాటగా ఉందా?

Published on Sun, 03/02/2025 - 17:35

సెలబ్రిటీలు కనిపిస్తే చాలు జనాలు ఎగబడిపోతున్నారు. కుదిరితే సెల్ఫీలు దిగుతున్నారు. లేదంటే తమ కెమెరాల్లో వారి ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ పరితపించిపోతున్నారు. సమయం, సందర్భం కూడా లెక్క చేయకపోవడం శోచనీయం. హీరోయిన్‌ కత్రినా కైఫ్‌ (Katrina Kaif) ఇటీవల మహాకుంభమేళాకు వెళ్లి స్నానమాచరించింది.

కత్రినా పవిత్ర స్నానం చేస్తుండగా వీడియో..
అయితే ఆమె కనబడగానే అందరు ఆమె చుట్టూ మూగారు. వీఐపీ ఘాట్‌ వద్ద పవిత్రస్నానం చేస్తుంటే వెంటనే ఫోన్లు తీసి వీడియోలు చిత్రీకరించడం మొదలుపెట్టారు. తనకంటూ ప్రైవసీ ఇవ్వకుండా చుట్టూ నిలబడి కత్రినాను తమ ఫోన్లలో చిత్రికరించారు. ఓ వ్యక్తి అయితే.. నేను, నా సోదరుడుతో పాటు ఎవరున్నారో చూడండి అంటూ కత్రినా కైఫ్‌ పవిత్ర స్నానం చేస్తుండగా ఆమెను తన వీడియోలో చూపించాడు. కుంభమేళా దర్శనాన్ని కత్రినా దర్శనంగా మార్చేశామని ఏదో గొప్ప పని చేసినట్లుగా తెగ నవ్వుతున్నారు. 

నవ్వులాటగా ఉందా?
ఈ వీడియోపై నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె కూడా మనిషేనని, తనను ఎందుకలా వేధిస్తున్నారని అభిమానులు మండిపడుతున్నారు. ఇదేమీ సరదాగా లేదని ఫైర్‌ అవుతున్నారు. నటి రవీనా టండన్‌ (Raveena Tandon) సైతం దీనిపై స్పందించింది. ఇది చాలా అసహ్యకరంగా ఉంది. ఎంతో ప్రశాంతంగా, అర్థవంతంగా చేసుకునే పనుల్ని ఇలాంటి జనాలు చెడగొడుతుంటారు అని మండిపడింది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)