Breaking News

అక్కను రౌడీలా వేధించా.. సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తోంది

Published on Sat, 05/11/2024 - 13:33

ఎంత గొడవపడ్డా సరే అక్కాచెల్లెళ్లు వెంటనే కలిసిపోతారు. అయితే వారి మధ్య పోట్లాటలు ఎప్పుడూ ఉండనే ఉంటాయి. ఒకరు హైపర్‌ అయిపోతే మరొకరేమో అన్నింటినీ ఓపికగా భరిస్తూ ఉంటారు. బాలీవుడ్‌ నటి రత్న పాఠక్‌ షా మొదటి రకం. తన సోదరిని ఎమోషనల్‌గా టార్చర్‌ పెట్టిందట! ఈ విషయాన్ని ఆవిడే స్వయంగా వెల్లడించింది.

రౌడీలా ప్రవర్తించా
'సుప్రియ అక్క, నేను చిన్నగా ఉన్నప్పుడు తెగ పోట్లాడుకునేవాళ్లం. తనకు నేను మంచి చెల్లినైతే కాదు. ఒక రౌడీలా ప్రవర్తించేదాన్ని. ఏది పడితే అది అనేసి బాధపెట్టేదాన్ని. అది గుర్తు చేసుకుంటే సిగ్గుతో చచ్చిపోవాలనిపిస్తుంది. తన మనసును బాధపెట్టినందుకు ఆమెకు సారీ చెప్పాను. తను నన్ను క్షమించిందనే అనుకుంటున్నాను. ప్రస్తుతం మేము బాగానే ఉన్నాం' అని తెలిపింది.

అందంగా లేనేమోనని
సినీ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. 'ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు నేనంత అందంగా లేనేమోనని భయపడేదాన్ని. నా పళ్లు, పెదాలు బాగోవని.. అలాగే నా కళ్లు కూడా అంత పెద్దవి కావని ఫీలయ్యేదాన్ని. కానీ సుప్రితకు అందమైన కళ్లుండేవి. అలా అని తను నాకన్నా అందంగా ఉందని నేనేమీ ఈర్ష్య పడేదాన్ని కాదు. నా ప్రవర్తన, క్రమశిక్షణ, టాలెంట్‌పై ఫోకస్‌ పెట్టేదాన్ని' అని చెప్పుకొచ్చింది. కాగా రత్న పాఠక్‌ 2023లో వచ్చిన ధక్‌ ధక్‌ అనే సినిమాలో చివరిసారిగా నటించింది. సుప్రియ పాఠక్‌.. సత్యప్రేమ్‌కీ కథ చిత్రంలో మెరిసింది.

చదవండి: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన రొమాంటిక్‌ సినిమా

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)