Breaking News

దొంగచాటుగా 'కింగ్డమ్' చూసొచ్చిన రష్మిక

Published on Sat, 08/02/2025 - 16:52

విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే చాలామందికి అతడి సినిమాల కంటే రష్మికనే ముందు గుర్తొస్తుంది. ఎందుకంటే గతంలో కలిసి నటించిన వీళ్లు.. ప్రస్తుతం ప్రేమలో ఉన్నారని, త్వరలో పెళ్లి చేసుకుంటారనే రూమర్స్ ఎప్పటికప్పుడు వినిపిస్తూనే ఉంటాయి. రీసెంట్‌ టైంలో ఈ పుకార్లని బలపరిచేలా విజయ్, రష్మిక వేర్వేరు సందర్భాల్లో చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు రూమర్ బాయ్ ఫ్రెండ్ కోసం రష్మిక మరో క్రేజీ పని చేసింది. ఆ విషయాన్ని నిర్మాత నాగవంశీ బయటపెట్టారు.

(ఇదీ చదవండి: హీరో విశాల్ ఇంట్లో శుభకార్యం.. విదేశీయుడితో పెళ్లి)

విజయ్ దేవరకొండ లీడ్ రోల్ చేసిన 'కింగ్డమ్' మూవీ రీసెంట్‌గా థియేటర్లలోకి వచ్చింది. మిక్స్‌డ్ టాక్ వచ్చినప్పటికీ బాగానే ఫెర్ఫార్మ్ చేస్తోంది. రిలీజ్ రోజే.. 'మనం కొట్టినం' అని సంతోషంగా సినిమా సక్సెస్ గురించి రష్మిక పోస్ట్ పెట్టింది. ఇప్పుడు సీక్రెట్‌గా హైదరాబాద్‌లోని ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్‌కి వెళ్లి మరీ ఈ మూవీ చూసొచ్చింది. తాజాగా పలువురు మీడియా వాళ్లతో రౌండ్ టేబుల్ ఇంటర్వ్యూ జరగ్గా.. ఇందులో మాట్లాడిన నాగవంశీ ఈ సంగతి చెప్పుకొచ్చారు.

భ్రమరాంబ థియేటర్‌లో రష్మిక.. 'కింగ్డమ్' చూడాలనుకుందని, అయితే ఈమె వెళ్లిన తెలిస్తే ఇబ్బందులు వస్తాయనే ఉద్దేశంతో రహస్యంగా వెళ్లి సినిమా చూసొచ్చారు అని నాగవంశీ.. అసలు సంగతి చెప్పారు. దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు. విజయ్-రష్మిక బాండింగ్ అంటే ఇది అని మాట్లాడుకుంటున్నారు. ఇకపోతే 'కింగ్డమ్' చిత్రానికి రెండు రోజుల్లో రూ.53 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్ వచ్చాయని నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. చూస్తుంటే మరికొన్ని రోజుల్లో రూ.100 కోట్ల మార్క్ దాటేయడం గ్యారంటీ అనిపిస్తోంది.

(ఇదీ చదవండి: తెలుగు సినిమాలకు జాతీయ అవార్డ్స్.. బన్నీ ఆనందం)

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)