సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి పిటిషన్ పై విచారణ
Breaking News
ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది.. రోజూ భయంతో
Published on Wed, 06/24/2026 - 09:05
ఇప్పుడు సోషల్ మీడియా విజృంభన మామూలుగా లేదు. చీమ చిటుక్కుమన్నా వార్త అయిపోతోంది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన ముందుంటోంది. దీంతో చాలామంది తమ ఎదుగుదలకు సోషల్ మీడియాని వాడుకుంటున్నారు. మరికొందరు మాత్రం షాక్ తగిలినట్లుగా భయపడిపోతున్నారు. కొన్ని విషయాల్ని గోరంతని కొండంత చేయడమే ఇందుకు కారణం కావచ్చు. మరికొన్ని హ్యాండిల్స్ రూమర్స్ ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే నిప్పు లేనిదే పొగ రాదుగా అనే వాదనను కొట్టి పారేయలేని పరిస్థితి.
(ఇదీ చదవండి: ఓవైపు విడాకులు కేసు.. హీరో ఇంట్లో చోరీ)
ఒక్కోసారి పరిస్థితులని బట్టి చేసిన వ్యాఖ్యలు ఆ తర్వా వారిని విమర్శలకు గురి చేస్తుంటాయి. వాటి నుంచి బయటపడటానికి కొందరు నా వ్యాఖ్యలను వక్రీకరించారు అని ఎదురదాడి చేస్తుంటారు. ఏదేమైనా ఇప్పుడు సోషల్ మీడియాకు కొందరు భయపడుతున్నారని చెప్పక తప్పదు. తమ గురించి జరుగుతున్న వదంతుల నుంచి బయట పడటానికి కొందరు సోషల్ మీడియాకే దూరం అవుతున్న పరిస్థితి. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక కూడా సోషల్ మీడియా దెబ్బకు భయపడుతున్నట్లు తేట తెల్లమైంది. ఇందుకు చిన్న ఉదాహరణ తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలే.
సామాజిక మాధ్యమాల్లో ప్రముఖుల గురించి దొర్లుతున్న వదంతులపై మీ స్పందన అన్న ప్రశ్నకు రష్మిక బదులిస్తూ.. ఇప్పుడు ఏం మాట్లాడాలన్నా భయమేస్తోంది. ఏం మాట్లాడినా అది వేరే విధంగా బయటకు పోతోంది. అనని విషయాలను అన్నట్లుగా ప్రచారం చేస్తున్నారు. అందుకే మనం గురించి ఎలాంటి రూమర్ ప్రచారమవుతుందోనని రోజూ భయంతో గడపాల్సిన పరిస్థితి నెలకొంది. సోషల్ మీడియా ఎదుగుదల మంచిదే, కానీ దాన్ని కొందరు తప్పుగా వాడుతుండటమే బాగోలేదు అని రష్మిక చెప్పుకొచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రియుడు, హీరో విజయ్ దేవరకొండని పెళ్లి చేసుకున్న రష్మిక.. ప్రస్తుతం భర్తతోనే 'రణబాలి' సినిమా చేస్తోంది. మరోవైపు ఈమె నటించిన లేటెస్ట్ హిందీ మూవీ 'కాక్ టెయిల్ 2' రీసెంట్‌గానే థియేటర్లలోకి వచ్చింది. కానీ ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేకపోయింది.
(ఇదీ చదవండి: చిరు లీక్స్.. సమంత ప్రెగ్నెన్సీ గురించి చెప్పేసిన మెగాస్టార్)
Tags : 1