Breaking News

బన్నీ కోసం రిస్క్ చేయబోతున్న రష్మిక?

Published on Sat, 07/12/2025 - 15:16

హీరోయిన్లు సాధారణంగా కెరీర్ పీక్ స్టేజీలో ఉన్నప్పుడు సినిమాల విషయంలో సాహసాలు చేయడానికి ఇష్టపడరు. ఎందుకంటే ఏదైనా తేడా కొడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉండొచ్చు. అయితే కొన్నిసార్లు మాత్రం అది వర్కౌట్ అవ్వొచ్చు. రేంజ్ ఎక్కడికో వెళ్లిపోవచ్చు. ఇప్పుడు పాన్ ఇండియా బ్యూటీ రష్మిక కూడా అలాంటి ఓ డేరింగ్ స్టెప్ తీసుకుందనే టాక్ వినిపిస్తోంది.

ఈ మధ్య కాలంలో యానిమల్, పుష్ప 2, ఛావా.. ఇలా వరస సినిమాలతో హిట్స్ కొట్టిన రష్మిక, పాన్ ఇండియా మార్కెట్‌లో వేలకోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన చిత్రాల్లో భాగమైంది. కొన్నిరోజుల ముందు రిలీజైన 'కుబేర'తోనూ సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈమె చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి. వీటితో పాటు ఇప్పుడు అల్లు అర్జున్-అట్లీ మూవీలోనూ భాగమైనట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: రేణు దేశాయ్‌కు సర్జరీ.. అసలేమైంది?)

'పుష్ప 2' తర్వాత బన్నీ, తమిళ దర్శకుడు అట్లీతో పనిచేస్తున్నాడు. ఇదివరకే షూటింగ్ మొదలైపోయింది. దీపికా పదుకొణెని హీరోయిన్‌గానూ అనౌన్స్ చేశారు. మృణాల్, జాన్వీ కపూర్ కూడా ఉన్నారని తెలుస్తోంది. రష్మిక కూడా ఇందులో కీ రోల్ చేస్తుందని రూమర్ వచ్చినప్పుడు ఇంకెంత మంది హీరోయిన్లకు చోటుందా అని అనుకున్నారు. అయితే రష్మికది హీరోయిన్ రోల్ కాదని టాక్.

బన్నీతో తలపడే నెగిటివ్ రోల్‌లో రష్మిక కనిపించనుందని అంటున్నారు. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం వేరే లెవల్ ఉండొచ్చు. గతంలో కెరీర్ పీక్ స్టేజీలో ఉండగానే రమ్యకృష్ణ, మీనా లాంటి హీరోయిన్లు నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో నటించి మెప్పించారు. మరి రష్మిక కూడా అలాంటి డెసిషన్ తీసుకుందా లేదా అనేది కొన్నిరోజుల్లో తేలుతుంది.

(ఇదీ చదవండి: నాగచైతన్యపై ఆ రూమర్స్ నిజం కాదు)

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)