వీకెండ్‌లో రష్మిక ఎవరిని కలుస్తుందంటే..?

Published on Mon, 04/01/2024 - 06:56

నటీ నటుల్లో ఒక్కొక్కరికి ఒక్కో పాలసీ వుంటుంది. కొందరు ఆదివారం షూటింగ్‌లకు సెలవు ప్రకటిస్తుంటారు. మరి కొందరు వారాంతర రోజున కుటుంబసభ్యులకు కేటాయిస్తూ వుంటారు. ఇంకొందరు పార్టీలకు, పబ్‌లకు వెళుతుంటారు. ఇక రష్మిక మందన్న ఏం చేస్తారో తెలుసా? ఇండియా క్రష్‌ అయిన ఈ బ్యూటీ చేతినిండా చిత్రాలతో క్షణం కూడా తీరికలేనంత బిజీ. ఇటీవల ఈమె నటించిన హిందీ చిత్రం యానిమల్‌ సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే.

ఈ చిత్రంతో రష్మిక మందన్న బాలీవుడ్‌లోనూ స్టార్‌ అంతస్థుకు చేరుకున్నారు. అక్కడ మరిన్ని అవకాశాలు ఈ బ్యూటీని వెతుక్కుంటూ వస్తున్నాయట. ఇటీవల జపాన్‌ వెళ్లి వచ్చిన రష్మికకు అక్కడ అభిమానుల నుంచి ఘనస్వాగతం లభించడం విశేషమనే చెప్పాలి. ఇకపోతే తెలుగు, తమిళం భాషల్లోనూ పలు చిత్రాలలో నటిస్తూ రష్మిక మందన్న బిజీగా వున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్‌ సరసన నటిస్తున్న పుష్ప–2 చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నారు. అదేవిధంగా రెయిన్‌బో, ది గర్ల్‌ఫ్రెండ్‌ చిత్రాల్లోనూ నటిస్తున్నారు. నటిగా ఇంత బిజీగా ఉన్నా కూడా ఈ అమ్మడు వీకెండ్‌లో తన మిత్రబృందంతోనే ఎక్కువగా గడుపుతారట. కుటుంబసభ్యులకు కాస్త సమయాన్ని కేటాయించినా, ఎక్కువగా స్నేహితులతోనే జాలీగా గడిపేస్తారట. ఇది తన పాలసీ అని రష్మిక మందన్న వర్గం మాట.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)