Breaking News

ఓటీటీలో 'రష్మిక' హిట్‌ సినిమా.. ఉచితంగానే స్ట్రీమింగ్‌

Published on Tue, 12/16/2025 - 07:58

బాలీవుడ్‌లో విజయం దక్కించుకున్న థామా సినిమా ఓటీటీలోకి వచ్చేసిన విషయం తెలిసిందే.. అయితే, రెంట్‌ ప్రాతిపదికన స్ట్రీమింగ్‌ అవుతుంది. కానీ, తాజాగా ఉచితంగానే చూసే సౌకర్యం కల్పించారు. ఆయుష్మాన్‌ ఖురానా, రష్మికా మందన్నా ప్రధానపాత్రల్లో నటించిన హారర్‌ మిస్టరీ రొమాంటిక్‌ కామెడీ చిత్రం ‘థామా’. మడాక్‌ హారర్‌ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్‌ ఆదిత్య సర్పోత్థార్‌ దర్శకత్వం వహించారు. దినేష్‌ విజన్, అమర్‌ కౌశిక్‌ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్‌పాత్రలో ఆయుష్మాన్‌ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా  మందన్నా దుమ్మురేపారు.

థియేటర్లలో దీపావళి కానుకగా అక్టోబరు 21న ధామా విడుదలైంది. బాక్సాఫీస్‌ వద్ద సుమారు రూ. 220 కోట్లకు పైగానే రాబట్టింది.  అనంతరం  అమెజాన్ ప్రైమ్(amazon prime video) ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, హిందీలో  అద్దె విధానంలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ మూవీ ఇప్పుడు ఉచితంగానే చూసే అవకాశం కల్పించింది.

థామా స్టోరీ ఏంటి..?
'థామా' విషయానికొస్తే.. అలోక్‌ గోయల్‌ (ఆయుష్మాన్‌ ఖురానా) ఓ జర్నలిస్ట్‌. ఫ్రెండ్స్‌తో కలిసి న్యూస్ కవరేజీ కోసం ఓ రోజు కొండ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఇతడిపై ఎలుగుబంటి దాడి చేయగా.. తడ్కా (రష్మిక) రక్షిస్తుంది. ఆమె బేతాళ జాతికి చెందిన యువతి. మనుషుల రక్తాన్ని తాగే అలవాటున్న వీళ్లకు ఎన్నో అతీత శక్తులుంటాయి. ఈ జాతికి నాయకుడు థామాగా పిలిచే యక్షాసన్‌ (నవాజుద్దీన్‌ సిద్ధిఖీ) చేసిన ఓ తప్పు కారణంగా బేతాళ జాతి అతడిని ఎన్నో దశాబ్దాలుగా ఓ గుహలో బందీగా ఉంచుతుంది.

అలాంటి బేతాళ సామ్రాజ్యంలోకి అలోక్‌ వచ్చాడని తెలిసి.. ఆ జాతి వాళ్లు ఇతడిని శిక్షించే ప్రయత్నం చేయగా.. తడ్కా తప్పిస్తుంది. ఈ క్రమంలోనే అలోక్‌తో ప్రేమతో పడిన తడ్కా.. తన జాతిని విడిచి జనజీవనంలోకి వస్తుంది. తర్వాత వీళ్ల ప్రేమలో ఎలాంటి మలుపులు చోటుచేసుకున్నాయి. తడ్కా ఓ వ్యాంపైర్ అని అలోక్‌కి ఎప్పుడు తెలిసింది? ఈ కథకు 'భేడియా', 'ముంజ్యా', 'స్త్రీ 2' సినిమాలతో లింకేంటి? చివరకు ఏమైందనేదే మిగతా స్టోరీ.

Videos

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)