Breaking News

నా పీరియడ్స్ టైమ్‌.. విజయ్ చేసే పని అదే: రష్మిక

Published on Mon, 10/26/2026 - 18:45

టాలీవుడ్‌లో ఇప్పుడంతా విరోష్ జంట పేరు హాట్‌టాపిక్‌గా మారింది. రణబాలి రిలీజ్ తర్వాత వీరిద్దరి పేర్లు మార్మోగిపోతున్నాయి. ఇటీవల ఈ జంట కాఫీ విత్ కరణ్ షోకు కూడా హాజరయ్యారు. ఆ తర్వాత తమ రిలేషన్, పెళ్లి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రష్మిక తనను దాదాపు వందసార్లు పెళ్లి చేసుకోమని అడిగిందని విజయ్ సరదాగా చెప్పుకొచ్చారు.

‍అంతలోనే ఈ జంటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. వీరిద్దరు విడిపోతున్నారంటూ కొందరు రూమర్స్ ప్రచారం చేస్తున్నారు. కొందరు కావాలనే ఈ జంటపై నెగెటివ్ ప్రచారం చేస్తున్నారని నెట్టింట టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రష్మిక, విజయ్ సైతం ట్రోల్స్‌పై స్పందించారు. తామిద్దరం చాలా సంతోషంగా ఉన్నామని.. అవసరంగా మా వ్యక్తిగత జీవితాల్లో జోక్యం చేసుకోవద్దని కాస్తా గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు.

ఇదంతా పక్కనపెడితే ఇటీవల ఇంటర్వ్యూలో రష్మిక ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు.  తాను నెలసరి సమయంలో తీవ్రమైన నొప్పితో బాధపడుతుంటే విజయ్ తనను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడని రష్మిక వెల్లడించారు. ఆ సమయంలో విజయ్ నా చేతులు, కాళ్లను ఒత్తుతూ తనను ప్రేమగా చూసుకుంటాడని పేర్కొన్నారు. ‍‍తాను అలా పక్కన ఉండటం ఎంతో ఓదార్పునిస్తుందని రష్మిక వివరించారు.

అయితే పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందే విజయ్‌కు ముందుగానే సమాచారం ఇస్తానని రష్మిక చెప్పారు. పురుషులకు ఈ విషయాలపై పూర్తి అవగాహన లేకపోయినప్పటికీ.. విజయ్ తనను అర్థం చేసుకోవడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా తనకు మొదటిసారి రుతుస్రావం అయినప్పటి అనుభవాన్ని కూడా రష్మిక గుర్తు చేసుకున్నారు. అప్పుడు నాకు చాలా భయమేసిందని తెలిపింది. ఆ సమయంలో శానిటరీ ప్యాడ్స్ అనేవి ఉంటాయని కూడా నాకు తెలియదని పేర్కొంది. టవల్స్‌నే మడతపెట్టి వాడానని.. ఇది కేవలం ఒక్కసారే వస్తుందేమో అనుకున్నానని ఆనాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

అయితే ప్రస్తుతం సినీ పరిశ్రమలో నెలసరి సెలవుల ప్రస్తావన ఇంకా రాలేదని రష్మిక ఆవేదన వ్యక్తం చేశారు. ఇండస్ట్రీలో మహిళలు ఉన్నత స్థానాల్లో ఉన్నప్పటికీ.. నెలసరి సెలవులు లేకుండా పనిచేయడమే వారికి సాధారణమైపోయిందన్నారు. ఇది చాలా విచారకరం అన్నారు. తాను నెలసరి నొప్పిని తట్టుకోవడానికి హాట్ ప్యాడ్స్ వాడతానని, జీలకర్ర నీళ్లు తాగుతానని కూడా రష్మిక వెల్లడించారు. 
 

Videos

ప్రొద్దుటూరు చరిత్రలో ఎప్పుడూ ఇలా జరగలేదు

YSRCP రమేష్ రెడ్డి కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏపీకి శని కలియుగ శకుని

ప్రజలకు మరో షాక్..! రెండు కొత్త G.O లు.. 16 రంగాలు ప్రైవేటీకరణ

రేపు, ఎల్లుండి వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

టీడీపీ అరాచకాలపై అమిత్ షా కు ... ఢిల్లీలో శకుని తాతకు తలంటు

తనపై టీడీపీ నేతల దాడి.. ఇచ్చిపడేసిన హఫీజ్ ఖాన్

బాబుకు షాక్..! TDP MPTC అభ్యర్థి భర్త అరెస్ట్

క్యాష్ కొట్టు టికెట్ పట్టు.. మాధవిరెడ్డి అరాచకానికి టీడీపీకి గుడ్ బై చెపుతున్న నేతలు

SI ప్రియాంకపై కేసు నమోదు చేయాలి

Photos

+5

దీపావళి పటాస్‌లా వెలిగిపోతున్న మృణాల్ (ఫొటోలు)

+5

బ్లాక్‌ శారీలో ఆదితి రావు హైదరీ స్టన్నింగ్‌ ..(ఫోటోలు)

+5

బర్త్‌ డే మూడ్‌లో కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి.. (ఫోటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. లేటేస్ట్‌ లుక్ చూశారా? (ఫోటోలు)

+5

ఎల్లో డ్రెస్‌లో హీరోయిన్ అనుపమ అందాలు.. (ఫోటోలు)

+5

రెడ్ డ్రెస్‌లో మెరిసిపోతోన్న ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక.. (ఫోటోలు)

+5

'జైలర్' కోడలు ఇంత అందంగా ఉందేంటి? (ఫొటోలు)

+5

'ఆదర్శ కుటుంబం' ప్రమోషన్లలో శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

సెప్టెంబర్ బర్త్ డేస్.. అల్లు స్నేహ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

సోయగాల సంయుక్త.. వావ్ అనాల్సిందే (ఫొటోలు)