Breaking News

అప్పటికప్పుడే తీసుకున్న నిర్ణయమది: రష్మిక పోస్ట్ వైరల్

Published on Mon, 10/06/2025 - 19:09

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఆ ఇద్దరి పేర్లే తెగ వైరలవుతున్నాయి. ఆ జంట మరెవరో కాదు.. నేషనల్ క్రష్ రష్మిక.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఇటీవలే వీరిద్దరికీ ఎంగేజ్‌మెంట్‌ జరిగినట్లు వార్తలొస్తున్నాయి. కానీ దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ ప్రకటనైతే రాలేదు. వీరిద్దరిపై ఎప్పటి నుంచో డేటింగ్‌ రూమర్స్ వస్తున్నప్పటికీ ఒక్కరు కూడా రియాక్ట్ అవ్వలేదు. తాజాగా నిశ్చితార్థం విషయంలోనూ ‍అదే జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.

ఇక ఈ సంగతి పక్కన పెడితే రష్మిక నటించిన రెండు సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. అందులో ఒకటి థామా.. మరొకటి ది గర్ల్‌ఫ్రెండ్‌. ఈ నేపథ్యంలో రష్మిక చేసిన ఓ పోస్ట్‌ నెట్టింట వైరల్‌గా మారింది. లేటేస్ట్‌గా రిలీజైన థామా సాంగ్‌ గురించి రష్మిక పోస్ట్ పెట్టారు. ఆ సాంగ్‌ రూపొందించడం వెనక ఉన్న స్టోరీని వివరిస్తూ పోస్ట్‌ పెట్టారు. ఇదంతా దర్శకనిర్మాతలు అనుకోకుండా తీసుకున్న నిర్ణయమని తెలిపారు.

ఆయుష్మాన్ ఖురానా హీరోగా వస్తోన్న థామా నుంచి ఇటీవల నువ్వు నా సొంతమా అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఈ పాటలో రష్మిక తన అందంతో డ్యాన్స్‌తో అభిమానులను ‍అలరించింది. తాజాగా ఈ పాట వెనక ఉన్న ఓ ఆసక్తికర విషయాన్ని ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఇంతకీ అదేంటో తెలుసుకుందాం.

రష్మిక తన పోస్ట్‌లో రాస్తూ.. 'మేము ఓ అందమైన ప్రదేశంలో దాదాపు 12 రోజుల పాటు షూటింగ్‌ చేశాం. అయితే షూట్ చివరి రోజు మా దర్శకనిర్మాతలకు ఓ ఆలోచన వచ్చింది. ఈ ప్లేస్‌ ఇంత బాగుంది కదా మనం ఇక్కడ పాట ఎందుకు చేయకూడదని అన్నారు. ఆ ఆలోచన మా అందరికీ నచ్చింది. ఆ లొకేషన్ అందంగా ఉండడంతో మూడు, నాలుగు రోజుల్లోనే  పాటను పూర్తి చేశాం. మేము ప్లాన్‌ చేసిన వాటికంటే ఇది చాలా బాగా వచ్చింది. ఈ పాటలో భాగమైన వారందరికీ అభినందనలు. మీరంతా కూడా థియేటర్‌లో ఈ సాంగ్‌ను ఎంజాయ్‌ చేస్తారని ఆశిస్తున్నా' అంటూ సాంగ్‌ స్టిల్స్‌ను షేర్ చేశారు. కాగా.. ఈ హారర్‌ మిస్టరీ రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ఈ చిత్రానికి ముంజ్య ఫేమ్‌ ఆదిత్య సర్పోత్థార్‌ దర్శకత్వం వహించారు. 
 

 

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)