Breaking News

మగాళ్లకూ ఆ నరకం తెలియాలి: రష్మిక మందన్నా

Published on Wed, 11/05/2025 - 14:32

హీరోయిన్‌ రష్మిక మందన్నా (Rashmika Mandanna) ఏది పట్టినా బంగారమే అవుతోంది. యానిమల్‌ నుంచి కుబేర వరకు ఆమె చేసిన ప్రతి సినిమా సూపర్‌ హిట్టే.. ఒక్క సికిందర్‌ తప్ప! ఈ ఏడాది రష్‌.. ఇప్పటివరకు నాలుగు సినిమాల(ఛావా, సికిందర్‌, కుబేర, థామా)తో అలరించింది. ఇప్పుడేకంగా ఐదో మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్‌' (The Girlfriend Movie)తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.

టాక్‌ షోలో రష్మిక
రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీ నవంబర్‌ 7న విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌ కోసం బాగానే కష్టపడుతోందీ బ్యూటీ. ఈ మధ్యే తెలుగు బిగ్‌బాస్‌ తొమ్మిదో సీజన్‌ స్టేజీపైనా సందడి చేసింది. తాజాగా జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న జయమ్ము నిశ్చయమ్మురా షోకి హాజరైంది. ఈ టాక్‌ షోలో సినిమా కోసమే కాకుండా ఇతరత్రా విషయాలపైనా మాట్లాడింది.

మగాళ్లకు పీరియడ్స్‌ రావాలి
ముందుగా ఆమె మనసులో ఉన్న కోరిక గురించి జగపతిబాబు ప్రస్తావించాడు. మగాళ్లకు కూడా పీరియడ్స్‌ వస్తే బాగుండని ఫీలైనట్లున్నావ్‌? అని అడిగాడు. అందుకు రష్మిక క్షణం ఆలోచించకుండా అవునని తలూపింది. మగాళ్లకు ఒక్కసారైనా పీరియడ్స్‌ వస్తే.. ఆ బాధ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది అని చెప్పుకొచ్చింది. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.

చదవండి: ఓటీటీలో 'మిత్రమండలి'.. 20 రోజుల్లోనే స్ట్రీమింగ్‌

Videos

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)