Breaking News

అలా చేయడం తప్పు, అందుకు ఇదే ఒక ఉదాహరణ: రష్మిక

Published on Mon, 01/22/2024 - 03:02

హీరోయిన్‌ రష్మికా మందన్నా అంటూ మార్ఫింగ్‌ చేసిన ఓ డీప్‌ ఫేక్‌ వీడియో ఇటీవల సోషల్‌ మీడియాలో వైరల్‌ అయిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్‌ చేశారు. ఈ విషయంపై సోషల్‌ మీడియా వేదికగా రష్మికా మందన్నా స్పందించారు. ‘‘ఢిల్లీ పోలీసులకు ధన్యవాదాలు. నన్ను అభిమానిస్తూ, నాకు అండగా నిలిచేవారు నా చుట్టూ ఉన్నందుకు సంతోషిస్తున్నాను.

అలాగే ఇలాంటి ఘటనలకు (మార్ఫింగ్‌ ఫొటోలు, వీడియోలను ఉద్దేశించి) పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటారని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. అమ్మాయిలు... అబ్బాయిలు... ఎవరైనా కావొచ్చు. మీ అనుమతి లేకుండా మీ ఫొటోలను మార్ఫింగ్‌ చేయడం, దుర్వినియోగం చేయడం అనేవి తప్పు’’ అంటూ ‘ఎక్స్‌’లో షేర్‌ చేశారు రష్మికా మందన్నా. ప్రస్తుతం అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న ‘పుష్ప: ది రూల్‌’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారామె. అలాగే ‘ది గాళ్‌ ఫ్రెండ్‌’, ‘రెయిన్‌ బో’ అనే ఉమెన్‌ సెంట్రిక్‌ ఫిల్మ్స్‌ కూడా చేస్తున్నారీ బ్యూటీ. వీటితో పాటు కొన్ని బాలీవుడ్‌ ప్రాజెక్ట్స్‌ కూడా ఉన్నాయి.

Videos

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు