Breaking News

ఆ సినిమా నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకం: రష్మిక

Published on Fri, 07/26/2024 - 17:15

నేషనల్ క్రష్‌, కన్నడ భామ రష్మిక మందన్నా ప్రస్తుతం పుష్ప-2 చిత్రం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ షూటింగ్‌ పెండింగ్‌లో ఉండడంతో డిసెంబర్‌కు వాయిదా పడింది. పార్ట్‌-1లో శ్రీవల్లిగా మెప్పించిన పుష్ప-2లోనూ టాలీవుడ్ ఫ్యాన్స్‌ను అలరించనున్నారు.

అయితే టాలీవుడ్‌లో విజయ్ దేవరకొండ సరసన సరసన గీత గోవిందం, డియర్ కామ్రేడ్‌ చిత్రాల్లో నటించింది. భరత్‌ కమ్మ  దర్శకత్వంలో వచ్చిన డియర్‌ కామ్రేడ్‌పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కానీ ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఫ్యాన్స్‌ను అలరించలేకపోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌లో 2019లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది.

తాజాగా ఈ మూవీ రిలీజై ఐదేళ్లు పూర్తి కావడంతో రష్మిక ఎమోషనల్ పోస్ట్ చేసింది. ఫలితం ఎలా ఉన్నప్పటికీ ఆ జ్ఞాపకాలు మరిచిపోలేనివని తెలిపింది. ఈ సినిమాను ఆదరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ రాసుకొచ్చింది. ఎన్ని సినిమాలు చేసినా.. ఇప్పటికీ నన్ను లిల్లీ అని పిలుస్తున్నారని ఆనందం వ్యక్తం చేసింది. క్రికెట్ ట్రైనింగ్‌లో నెలల తరబడి గాయాల బారిన పడ్డామని ఆ రోజులను గుర్తు చేసుకుంది. అయితే షూటింగ్ రోజు కన్నీళ్లు, నవ్వులు, చెమటతో ఇచ్చిన సంతృప్తి తమ కష్టాన్ని మరిచిపోయేలా చేసిందన్నారు.  ఈ సినిమా నా కెరీర్‌లో చాలా ప్రత్యేకమైందని రష్మిక పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)