Breaking News

కొద్దిరోజులుగా మాస్క్‌తోనే రష్మిక.. కారణం ఇదేనా..?

Published on Sun, 10/26/2025 - 07:41

నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న కొద్దిరోజులుగా మాస్క్‌లోనే కనిపించేది.. కానీ, తాను నటించిన కొత్త సినిమా ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ట్రైలర్‌ ఈవెంట్‌ కోసం మాస్క్‌ లేకుండా మెరిసింది. ట్రైలర్‌ను చూస్తే ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. తన నటనకు ఎక్కువ స్కోప్‌ ఉందని తెలుస్తోంది. అయితే,  ఈ మూవీ విడుదల తర్వాత తన గురించి మరోసారి పాన్‌ ఇండియా రేంజ్‌లో గట్టిగా మాట్లాడుకోవడం ఖాయమని ట్రైలర్‌ చూస్తే అర్థం అవుతుంది. అయితే, కొద్దిరోజులుగా రష్మిక ఎక్కడ కనిపించినా సరే మాస్క్‌ పెట్టుకునే ఉండేది. తాజాగా జరిగిన ట్రైలర్‌ ఈవెంట్‌కు మాత్రం మాస్క్‌ లేకుండానే వచ్చేశారు.

రష్మిక తరచూ ముఖానికి మాస్క్‌ వేసుకుని కనిపించడంతో అభిమానులు కూడా ఏమై ఉంటుందనే చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ఆమె గత వారం చెన్నై విమానాశ్రయంలో మాస్క్‌ ధరించే మెరిశారు. ఆ సమయంలో ముఖానికి మాస్క్‌ తొలగించమని ఫొటోగ్రాఫర్లు కోరగా, ట్రీట్మెంట్‌ తీసుకుంటున్నందువల్ల కుదరదని ఆమె పేర్కొన్నారు. దీంతో రష్మిక మందన్నాకు ఏమైందని ఆరా తీయగా ఆమె తన అందాన్ని మరింత మెరుగు పరచుకునే విధంగా ముక్కుకు శస్త్ర చికిత్స చేయించుకున్నారని తెలిసింది. చాలారోజుల తర్వాత  ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమా కోసం మాస్క్‌ లేకుండా కనిపించి ఫ్యాన్స్‌లో జోష్‌ నింపారు. మరింత గ్లామర్‌గా కనిపిస్తున్న రష్మిక ఫోటోలు, వీడియోలు నెట్టింట షేర్‌ అవుతున్నాయి.

రీసెంట్‌గా థామా సినిమాతో మెప్పించిన రష్మిక.. ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ సినిమాతో మరోసారి అభిమానులను పలకరించనున్నారు. దీక్షిత్‌ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ పాన్‌ ఇండియా చిత్రాన్ని రాహుల్‌ రవీంద్రన్‌ తెరకెక్కించారు. అను ఇమ్మాన్యుయేల్‌ కీలక పాత్రలో నటించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ సమర్పణలో ధీరజ్‌ మొగిలినేని, విద్యా కొప్పినీడి నిర్మించారు. ఈ సినిమా నవంబరు 7న విడుదల కానుంది.   

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)