Breaking News

తెలుగు హీరోతో సినిమా వదులుకున్న స్టార్‌ హీరోయిన్.. తగిన శాస్తే జరిగింది!

Published on Sun, 09/03/2023 - 07:22

పుష్ప సినిమాతో ఒక్కసారిగా నేషనల్ క్రష్‌ ట్యాగ్ సొంతం చేసుకున్న భామ రష్మిక మందన్నా. ప్రస్తుతం ఆమె పరిస్థితి కాస్తా గందరగోళంగా మారింది. అనుకున్నదొక్కటి.. అయినది ఒక్కటి అన్న తరహాలో రష్మిక పరిస్థితి ఉందటున్నారు నెటిజన్స్‌. అసలు విషయానికొస్తే కన్నడ చిత్రసీమ నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చిన ముద్దుగుమ్మ. అక్కడ ఛలో అనే తొలి చిత్రంతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత చిత్రం గీతగోవిందంతో అనుహ్యమైన క్రేజ్‌ సంపాదించుకుంది. ఇక అల్లు అర్జున్‌తో పుష్ప చిత్రం ఏకంగా రష్మిక దశనే మార్చేసింది. ఈ చిత్రం ఆమెను బాలీవుడ్‌ వరకు తీసుకెళ్లింది. 

(ఇది చదవండి: Roopa Koduvayur: వరుస సినిమాలతో దూసుకెళ్తున్న తెలుగు బ్యూటీ )

అలా అక్కడ రెండు, మూడు చిత్రాలు చకచకా చేసేసింది భామ. ఆ చిత్రాలు ఆశించిన విజయాలను అందుకోలేకపోయినా, నటిగా రష్మికకు మాత్రం మంచి పేరే తెచ్చిపెట్టాయి. దీంతో మరో రెండు, మూడు చిత్రాలు ఈ బ్యూటీని వరించాయి. అలా రణ్‌వీర్‌ కపూర్‌ సరసన నటించిన యానిమల్‌ చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా షాహీద్‌ కపూర్‌ జత కట్టే అవకాశం రావడంతో ఎగిరి గంతేసింది. ఆ చిత్రం కోసం తెలుగులో టాలీవుడ్ హీరో నితిన్‌ సరసన నటించే అవకాశాన్ని వదులుకుంది. నిజానికి ఈ జంట భీష్మ చిత్రం సక్సెస్‌తో హిట్‌ పెయిర్‌గా పేరు తెచ్చుకుంది.

కాగా ఇప్పుడేమో షాహీద్‌ కపూర్‌ సరసన నటించే బాలీవుడ్‌ చిత్రం బడ్జెట్‌ కారణంగా ఆగిపోయిందనే విషయం రష్మికకు షాక్‌ ఇచ్చిందని సమాచారం. దీంతో ఆమె ఊహించింది ఒకటైతే జరిగింది.. మరొకటి అంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్దఎత్తున ట్రోలింగ్‌ జరుగుతోంది. ప్రస్తుతం రష్మిక హిందీలో యానిమల్‌ చిత్రం, తెలుగులో పుష్ప –2 చిత్రాలు పైనే ఆశ పెట్టుకుందని సమాచారం. అదే విధంగా రెయిన్బో అనే మరో ద్విభాషా చిత్రం కూడా ఆమె చేతిలో ఉంది. 

(ఇది చదవండి: సినీ ఇండస్ట్రీలో విషాదం.. తీవ్రమైన వ్యాధితో నటి మృతి!)

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)