Breaking News

కన్నడలో బ్యాన్‌.. స్పందించిన రష్మిక!

Published on Wed, 10/08/2025 - 12:38

ఈ మధ్య రష్మిక(Rashmika Mandanna ) పేరు సోషల్‌ మీడియాలో బాగా వినిపిస్తోంది. ఒకపక్క కెరీర్‌..మరోపక్క పర్సనల్‌ విషయాల్లో రకరకాల పుకార్లు వినిపిస్తున్నాయి.ఇటీవల విజయ్‌ దేవరకొండతో ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. మరోవైపు రష్మిక నటించిన తాజా చిత్రం ‘థామా’(Thama)ని కన్నడ ఇండస్ట్రీ బ్యాన్‌ చేసినట్లు పుకార్లు వచ్చాయి. అక్టోబర్‌ 21న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అ

అయితే రష్మిక సొంత రాష్ట్రం అయిన కర్ణాటకలో మాత్రం విడుదల కాదని.. కన్నడ ఇండస్ట్రీ ఆమెను బహిష్కరించిందనే వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ రూమర్స్‌పై రష్మిక స్పందించింది. ఇప్పటివరకు తనను ఏ ఇండస్ట్రీ బ్యాన్‌ చేయలేదని వెల్లడించింది. అపార్థం చేసుకోవడం వల్లే ఇలాంటి పుకార్లు పుట్టుకొస్తాయని ఆమె అన్నారు.

ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకోలేను 
కన్నడ చిత్రం ‘కాంతార: చాప్టర్‌ 1’ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా విడుదలై సూపర్‌ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాపై పలువురు సినీ ప్రముఖులు స్పందించారు. రిషబ్‌ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారు. కానీ అదే ప్రాంతానికి చెందిన రష్మిక మాత్రం ఈ చిత్రంపై స్పందించలేదు. దీంతో ఆమెపై సోషల్‌ మీడియాలో విమర్శలు వచ్చాయి. తాజాగా దీనిపై రష్మిక స్పందించింది. 

థామా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ..‘ఏ సినిమా రిలీజ్‌ అయినా..నేను రెండు, మూడు రోజుల్లోనే చూడలేను. కాంతార కూడా విడుదలైన కొన్ని రోజుల తర్వాత చూశాను. చిత్రబృందాన్ని అభినందిస్తూ మెసేజ్‌ కూడా చేశా. వాళ్లు నాకు ధన్యవాదాలు కూడా తెలిపారు. తెర వెనుక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మన వ్యక్తిగత విషయాలన్నీ కెమెరా ముందుకు తీసుకురాలేం కదా. ప్రతి విషయాన్ని ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తిని కాదు. . అందుకే ప్రజలు ఏమనుకున్నా పట్టించుకోను. వాళ్లు నా నటన గురించి ఏం మాట్లాడతారు అనేదే నాకు ముఖ్యం. దానిని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటాను’ అని రష్మిక అన్నారు.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)