Breaking News

విజయ్‌ దేవరకొండకు బ్రేకప్‌ చెప్పిన రష్మిక మందన్నా?

Published on Sat, 04/01/2023 - 21:34

రష్మిక మందన్నా, విజయ్‌ దేవరకొండ ప్రేమలో ఉన్నారని ప్రచారం జరగడం.. అదంతా తూచ్‌ అని ఇద్దరూ కొట్టిపారేయడం.. చివరికి జంటగా కనిపించడం సదా మామూలే! మేమిద్దరం మంచి ఫ్రెంట్స్‌ అంటారు వాళ్లు.. కాదు కాదు, మీరు కచ్చితంగా ప్రేమికులే అంటారు అభిమానులు. రీల్‌ లైఫ్‌లోని గీతాగోవిందం రియల్‌ లైఫ్‌లో కూడా ఒక్కటైతే చూడాలని ఉందని తహతహలాడుతుంటారు. కానీ వాళ్లు మాత్రం ఎప్పుడూ ఓపెన్‌ అయింది లేదు.

అయితే తాజాగా రష్మిక.. విజయ్‌కు బ్రేక్‌ చెప్పిందని ఇప్పుడు మరో హీరోకు దగ్గరైందంటూ బీటౌన్‌లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇంతకీ ఆ మరో హీరో ఎవరో కాదు, మన తెలుగు హీరో బెల్లంకొండ శ్రీనివాసే! వీరిద్దరూ రెండుమూడు సార్లు కలిసి కనిపించడం పాపం.. ప్రేమ మొదలైందంటూ కథనాలు అల్లేస్తున్నారు. ఏకంగా విజయ్‌కే బ్రేకప్‌ చెప్పిందని వార్తలు ప్రచారం చేస్తున్నారు. రష్మిక, బెల్లంకొండ శ్రీనివాస్‌.. ఈ మధ్య తరచూ కలుస్తున్న విషయం వాస్తవమే కానీ వారిది కేవలం స్నేహం మాత్రమే! అంతకు మించి అంటే ఒప్పుకునేది లేదంటున్నారు అభిమానులు. అయినా సరే కొందరు నెటిజన్లు మాత్రం వీరి వ్యవహారం ఏదో తేడాగా ఉందే అంటూ కామెంట్లు చేస్తున్నారు.

కాగా రష్మిక చివరిసారిగా వారిసు చిత్రంలో నటించింది. ప్రస్తుతం ఆమె సందీప్‌రెడ్డి వంగా డైరెక్షన్‌లో యానిమల్‌ మూవీ చేస్తోంది. బెల్లంకొండ శ్రీనివాస్‌ విషయానికి వస్తే అతడు ఛత్రపతి సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు.

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌