Breaking News

మరోసారి దెయ్యంగా.. ఈసారి సౌత్ సినిమాలో?

Published on Mon, 09/01/2025 - 15:40

ప్రస్తుత పాన్ ఇండియా ట్రెండ్‌లో ఎక్కువగా సక్సెస్ అయిన హీరోయిన్ రష్మిక. గత కొన్నేళ్లలో యానిమల్, ఛావా, పుష్ప 2 తదితర చిత్రాలతో ఈమె రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఒకే తరహా చిత్రాలు అని కాకుండా డిఫరెంట్ పాత్రలు చేస్తూ బిజీగా ఉంది. ప్రస్తుతం ఈమె చేతిలో 'గర్ల్ ఫ్రెండ్' అనే ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ, అలానే 'థామా' అనే హారర్ చిత్రంలోనూ చేస్తోంది.

'థామా' హిందీ సినిమా. ఇందులో వ్యాంపైర్ తరహా పాత్ర రష్మిక కనిపిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అలానే దెయ్యంగానూ కనిపించే అవకాశాలున్నాయని మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు దక్షిణాదిలో తీసే హారర్ చిత్రంలోనూ రష్మికకు క్రేజీ ఆఫర్ వచ్చిందని, ఇందులో ఈమె దెయ్యంగా నటించనుందని అంటున్నారు. ఇదంతా కాంచన 4 కోసమే అని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈ ప్రాజెక్ట్‌పై హైప్ పెరగడం గ్యారంటీ.

(ఇదీ చదవండి: నిన్ను ఎప్పటికీ మిస్ అవుతా.. వెంకటేశ్ ఎమోషనల్)

కొరియోగ్రాఫర్ నుంచి హీరోగా మారిన రాఘవ లారెన్స్.. 'కాంచన' సిరీస్‌తో చాలా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ ఫ్రాంచైజీలో ముని, కాంచన, కాంచన 2, కాంచన 3 చిత్రాలు వచ్చాయి. ప్రస్తుతం నాలుగో భాగం షూటింగ్ జరుగుతోంది. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. ఈ విషయాన్ని ఇదివరకే బయటపెట్టారు. ఇప్పుడు రష్మిక కూడా ఈ ప్రాజెక్టులో భాగమైందని, దెయ్యంగా కనిపించబోతుందని టాక్ వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.

సాధారణంగా కాంచన సిరీస్ సినిమాల్లో ముగ్గురు నలుగురు హీరోయిన్లు ఉంటారు. రూమర్స్ బట్టి చూస్తుంటే రష్మిక.. దెయ్యం పాత్ర చేయడం నిజమేనేమో అనే సందేహం కలుగుతుంది. ఒకవేళ ఇది ఫిక్స్ అయితే మాత్రం రష్మికని ఎలా చూపిస్తారనే ఆసక్తి కచ్చితంగా ఏర్పడుతుంది. 

(ఇదీ చదవండి: వివాదంలో సుమ కొడుకు సినిమా.. బండి సరోజ్ కుమార్ సంచలన కామెంట్స్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)