Breaking News

శ్రీలంకలో రష్మిక బ్యాచిలర్ పార్టీ.. తోడుగా ఆ హీరోయిన్

Published on Wed, 12/17/2025 - 15:56

పాన్ ఇండియా సినిమాలతో రష్మిక ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది ఈమె నుంచి ఐదు సినిమాలు వచ్చాయి. వీటి కంటే ఈమెకు గత నెలలో హీరో విజయ్ దేవరకొండతో నిశ్చితార్థం జరిగిందనే విషయం చర్చనీయాంశంగా మారింది. ఇది నిజమని ఇప్పటివరకు అటు రష్మిక గానీ ఇటు విజయ్ గానీ బయటపెట్టలేదు. కానీ ఈమె చేతికి ఉన్న రింగ్ మాత్రం ఇదంతా నిజమని చెప్పకనే చెబుతోంది.

(ఇదీ చదవండి: 'అవతార్'లో కళ్లుచెదిరే గ్రాఫిక్స్ వెనక భారతీయ మహిళ)

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారనే రూమర్స్ వస్తున్నాయి. మరి ఇందులో నిజానిజాల సంగతి పక్కనబెడితే ఇప్పుడు రష్మిక.. తన గర్ల్స్ గ్యాంగ్‌తో కలిసి శ్రీలంక ట్రిప్ వేసింది. బీచ్, రిసార్ట్స్‌లో ఫుల్ చిల్ అవుతూ కనిపించింది. ఈమెతో పాటు హీరోయిన్ వర్ష బొల్లమ్మ, కాస్ట్యూమ్ డిజైనర్ శ్రావ్య వర్మ కనిపించారు. మిగిలిన స్నేహితులు ఎవరనేది పెద్దగా తెలియదు.

'నాకు ఈ మధ్యే రెండు రోజుల బ్రేక్ దొరికింది. నా గర్ల్స్‌తో పాటు చిల్ అయ్యే ఛాన్స్ దొరికింది. మేం శ్రీలంకలోని ఈ అందమైన ప్రదేశానికి వెళ్లాం. గర్ల్స్ ట్రిప్స్.. ఎంత చిన్నవి అనేది సమస్య కాదు. నా గర్ల్స్ బెస్ట్' అని రష్మిక.. తన శ్రీలంక ట్రిప్ జ్ఞాపకాల్ని పోస్ట్ చేసింది. అయితే ఇది ఈమె బ్యాచిలరేట్ పార్టీ అని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చూస్తుంటే అలానే అనిపిస్తుంది కూడా. రష్మిక చేతిలో ఇప్పుడు మైసా, రెయిన్ బో అనే చిత్రాలున్నాయి.

(ఇదీ చదవండి: శ్రీలీల కూడా బాధితురాలే.. ఆవేదనతో పోస్ట్)

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)