సీక్రెట్‌గా సింగర్‌ని పెళ్లి చేసుకున్న నటి.. ఫోటోలు వైరల్‌

Published on Tue, 03/24/2026 - 17:32

బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ పెళ్లి చేసుకున్నారనే వార్త ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇషా తల్లి పూనమ్ రిఖీ సోషల్ మీడియా వేదికగా పెళ్లి ఫోటోలను పోస్ట్ చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.  అయితే దీనిపై అటు బాద్షా కానీ, ఇటు  ఇషా కానీ ఎవరూ అధికారికంగా స్పందించలేదు.

ఆరేళ్ల క్రితమే విడాకులు.. 
ర్యాపర్ బాద్షా అసలు పేరు ఆదిత్య ప్రతీక్ సింగ్ సిసోడియా.  హిందీ, పంజాబీ పాటలను రీమిక్స్ చేస్తూ యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ సంపాదించుకున్నాడు. అలాగే బాలీవుడ్‌లో పలు బ్లాక్‌బస్టర్ సినిమాల్లో పాటలు పాడి, మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  కెరీర్ పీక్స్‌లో ఉండగానే.. జాస్మిన్‌ అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు.  ఈ జంటకి ఓ  కూతురు ఉంది. ఇద్దరి మధ్య విభేధాలు రావడంతో ఆరేళ్ల క్రితం విడాకులు తీసుకొన్నారు. 

ఈషాతో డేటింగ్‌.. 
విడాకుల తర్వాత పంజాబీ నటి ఇషా రిఖీతో బాద్షా ప్రేమలో పడ్డాడు. ఇషాను ఓ పార్టీలో కామన్ ఫ్రెండ్ ద్వారా కలుసుకొన్నారు. అక్కడ జరిగిన వారి పరిచయం ఇద్దరిని మరింత దగ్గరకు చేర్చించింది.  గతకొంత కాలంగా ఇద్దరు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే వీరిద్దరు మాత్రం తమ ప్రేమ విషయాన్ని ఇప్పటివరకు బహిరంగంగా ప్రకటించలేదు.

పెళ్లి ఫోటోలు వైరల్‌.. 
తాజాగా ఈ జంట రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగినట్లు నేషనల్‌ మీడియాలో వార్తలు వచ్చాయి.  ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్‌ బ్లెస్‌ యూ’ అని క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో నెటిజన్స్‌ పెద్ద ఎత్తున ఈ  కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 

Videos

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

ప్రభాస్ సీక్వెల్ సినిమాలపై ధురంధర్ ఎఫెక్ట్

పసిడి ప్రేమికులకు పండగ.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..!

మొదలైన పెట్రోల్.. డీజిల్ కష్టాలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు..

భారత్‌లో గ్యాస్, పెట్రోల్ సంక్షోభం..! మోదీ క్లారిటీ..

కూటమిలో కామ పిశాచులు

ఇరాన్ సంచలన నిర్ణయం.. ప్రపంచ దేశాల్లో భారీగా పెరగనున్న పెట్రోల్ ధరలు?!

అనకాపల్లి స్టీల్ ప్లాంట్ రావడానికి కారణం జగనే

ఇరాన్ కు రష్యా సాయం? ఆధారాలు ఉన్నాయన్న జెలెన్ స్కీ

కల్తీ పాల నిందితులను కఠినంగా శిక్షించాలి

Photos

+5

హైదరాబాద్‌లో జోరు వాన (ఫోటోలు)

+5

నటిని పెళ్లాడిన ప్రముఖ ర్యాపర్‌ బాద్‌షా (ఫోటోలు)

+5

దురంధర్‌-2 మూవీ.. ఈ అరుదైన షూటింగ్ ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

రష్మిక-విజయ్ దేవరకొండ వెడ్డింగ్..ఈ అరుదైన ఫోటోలు చూశారా? (ఫోటోలు)

+5

ట్రంప్ ప్రకటనకు ముందు భారీ డీల్ 580 బిలియన్ డాలర్ల ట్రేడింగ్

+5

విశాఖపట్నంలో సినీ నటి శ్రుతి హాసన్‌ సందడి (ఫొటోలు)

+5

శ్రీరామనవమి స్పెషల్ : ఏపీలో ఉన్న ఈ అద్భుతమైన ఆలయం గురించి తెలుసా? (ఫొటోలు)

+5

ధురంధర్‌ 2కి బ్లాక్‌బస్టర్‌ టాక్‌.. ట్రెండింగ్‌లో హీరోయిన్‌ సారా (ఫోటోలు)

+5

ఘనంగా 'బ్యాండ్‌ మేళం' ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ లో కొత్తగా నిర్మించిన అద్భుత ఆలయం ఎక్కడో తెలుసా? (ఫొటోలు)