కస్టడీలో రన్యా రావు.. కన్నీళ్ల పర్యంతమైన నటి!

Published on Sun, 03/09/2025 - 17:55

ప్రముఖ కన్నడ నటి రన్యా రావు బంగారం స్మగ్లింగ్‌ చేస్తూ పట్టుబడింది. దుబాయ్ నుంచి బెంగళూరు చేరుకున్న ఆమెను డీఆర్‌ఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె వద్ద నుంచి దాదాపు 14 కేజీలకు పైగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటికే రన్యారావును అరెస్ట్‌ చేసిన అధికారులు రిమాండ్‌కు పంపించారు. ప్రస్తుతం రన్యా రావును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారుల కస్టడీలో ఉన్నారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

అయితే ఇవాళ డీఆర్‌ఐ అధికారుల ముందు విచారణకు హాజరైన రన్యారావు కన్నీళ్ల పర్యంతమైంది. అసలు ఇందులోకి ఎందుకు వచ్చానో అంటూ తన న్యాయవాదులతో అన్నారు. నిద్రలో కూడా ఎయిర్‌పోర్ట్‌ గుర్తొస్తోందని.. అస్సలు నిద్రపట్టడం లేదని తెలిపింది. మానసికంగా కృంగిపోయానని తన లాయర్లతో రన్యా రావు చెప్పింది. విచారణ సందర్భంగా ఫుల్ ఎమోషనలైంది రన్యా రావు. మరోవైపు ఆమెపై ఇప్పటికే సీబీఐ అధికారులు కూడా కేసు నమోదు చేశారు.

కాగా.. మాణిక్య సినిమాతో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన రన్యా రావు కేవలం మూడు చిత్రాల్లో మాత్రమే కనిపించింది. ఈ మూవీ తెలుగు సినిమా మిర్చి రీమేక్‌గా తెరకెక్కించారు. ఆ తర్వాత పటాస్‌ కన్నడ రీమేక్‌ పటాకిలో హీరోయిన్‌గా నటించింది. తమిళంలో వాఘా మూవీ చేసింది. ఎనిమిదేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటోంది. బంగారు అక్రమ రవాణా చేస్తుండగా మార్చి 3న దుబాయ్ నుంచి వస్తుండగా కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో  డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)