Breaking News

రన్యారావుకు మరిన్ని కష్టాలు .. ఆ చట్టంతో ఇక బెయిల్ కష్టమే!

Published on Sat, 04/26/2025 - 12:07

బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడి కన్నడ నటి రన్యారావు చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. విమానాశ్రయంలో డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత కస్టడీకి తీసుకుని మరిన్ని వివరాలు సేకరించారు. ప్రస్తుతం జైల్లో ఉంటున్న రన్యారావుకు ఇప్పటి వరకు బెయిల్ రాలేదు. గతంలో ఆమె బెయిల్‌ పిటిషన్‌ వేయగా..  బెంగళూరు ఆర్థిక నేరాల కోర్టు (Court for Economic Offences) తిరస్కరించింది.  

అయితే ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసు ఆమె చుట్టూ మరింత ఉచ్చు బిగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బంగారం స్మగ్లింగ్ కేసులో బెయిల్‌ ఆమెకు బెయిల్‌ నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రన్యా రావుపై విదేశీ మారకద్రవ్యం, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం-1974((COFEPOSA)) కూడా ప్రయోగించినట్లు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) సిఫార్సు మేరకు ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని నోడల్ ఏజెన్సీ అయిన సెంట్రల్ ఎకనామిక్ ఇంటెలిజెన్స్ బ్యూరో (CEIB) ఈ చట్టాన్ని ప్రయోగించింది. ఈ చట్టం ప్రకారమైతే దాదాపు ఏడాది పాటు బెయిల్‌ వచ్చే అవకాశం లేదు. నిందితుడు దర్యాప్తు సంస్థలకు సహకరించడం లేదని తేలితే ఈ చట్టం ప్రయోగిస్తారని సమాచారం. ఈ కేసులో రన్యా రావు పదేపదే బెయిల్ కోసం  ప్రయత్నించిన నేపథ్యంలో కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు ఈ చర్య తీసుకున్నట్లు వర్గాలు వెల్లడించాయి. ఆమెతో పాటు ఇతర నిందితులు తరుణ్ రాజు, సాహిల్ సకారియా జైన్‌లపై కూడా ఈ చట్టం కింద కేసు నమోదు చేశారు.

కాగా.. రూ.12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారాన్ని స్మగ్లింగ్ చేస్తుండగా సీనియర్ పోలీసు అధికారి రామచంద్రరావు సవతి కుమార్తె రన్యారావును మార్చి 3న అరెస్టు చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రన్యారావుతో పాటు మరో ఇద్దరు నిందితులు ప్రస్తుతం బెంగళూరు సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసును డీఆర్‌ఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దర్యాప్తు చేస్తున్నాయి. డీజీపీ రామచంద్రరావు పాత్రపై రాష్ట్ర ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి సమర్పించినట్లు  తెలుస్తోంది. ఈ కేసులో మూడో నిందితుడైన జైన్‌తో కలిసి నటి హవాలా లావాదేవీలకు పాల్పడినట్లు డీఆర్‌ఐ దర్యాప్తులో తేలింది. 
 

Videos

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)