Breaking News

మాజీ ప్రియుడిని ఫ్యామిలీ అంటున్న భార్యలు.. జర జాగ్రత్త!: నటుడి హెచ్చరిక

Published on Wed, 09/03/2025 - 18:39

ప్రేమలో ఇన్వెస్ట్‌ చేస్తే ఏమీ మిగలదు అంటున్నాడు బాలీవుడ్‌ నటుడు రణ్‌వీర్‌ షోరే (Ranvir Shorey). చిన్నప్పటి నుంచి తనకు ‍ప్రేమ కలిసిరావడం లేదని చెప్తున్నాడు. కానీ తాను బంబుల్‌ అనే ఓ డేటింగ్‌ యాప్‌లో ఉన్నట్లు తెలిపాడు. రణ్‌వీర్‌ ఇంకా మాట్లాడుతూ.. స్త్రీపురుషుల మధ్య దూరం పెరిగింది. మాజీ ప్రియుడితో కలిసి భర్తను చంపుతున్న భార్య.. కుటుంబసభ్యుల అండదండలతో భార్య ప్రాణాలు తీసిన భర్త.. ఇలాంటి వార్తలే తరచూ కనిపిస్తున్నాయి. 

ప్రేమలో ఇన్వెస్ట్‌?
నాకైతే చిన్నప్పటినుంచి ఈ ప్రేమలు కలిసిరావడం లేదు. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్‌ను బట్టి ప్రేమలో పడేందుకు ఇది సరైన సమయం కాదేమో అనిపిస్తోంది. మార్కెట్‌ పడిపోతున్నప్పుడు ఇన్వెస్టర్లు డబ్బు పెట్టరు. ప్రేమ విషయంలోనూ అంతే.. ఇప్పుడు మార్కెట్‌ బాగోలేదు. కాబట్టి లవ్‌లో ఇన్వెస్ట్‌ చేయడం కరెక్ట్‌ కాదు. రోజులెలా ఉన్నాయంటే.. నా మాజీ ప్రియుడు కూడా నా కుటుంబ సభ్యుడే అని భార్య ఎదురుతిరిగి చెప్తోంది. 

మార్కెట్‌ బాగోలేదు
ఆమె అన్నదాంట్లో తప్పేముందని పదిమంది తనకు వత్తాసు పలుకుతున్నారు. దీన్నే డౌన్‌ మార్కెట్‌ అంటున్నాను. ఇలాంటి సమయంలో ప్రేమ జోలికి పోకుండా.. బుద్ధిగా ఇంట్లో ఉండి బాడీ బిల్డింగ్‌పై ఫోకస్‌ చేస్తే మీకే మంచిది అని సలహా ఇచ్చాడు. కాగా రణ్‌వీర్‌ షోరే.. గతంలో పూజా భట్‌ను ప్రేమించాడు. కొంతకాలం పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరూ తర్వాత బ్రేకప్‌ చెప్పుకున్నారు. 

పెళ్లి
2010లో నటి కొంకణసేన్‌ శర్మను పెళ్లాడాడు. వీరికి కుమారుడు హరూన్‌ సంతానం. భార్యాభర్తల మధ్య పొరపచ్చాలు రావడంతో 2015లో విడిపోయారు. 2020లో విడాకులు తీసుకున్నారు. రణ్‌వీర్‌ చివరగా బిండియాకే బాహుబలి అనే సిరీస్‌లో కనిపించాడు. హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ మూడో సీజన్‌లోనూ పాల్గొన్నాడు.

చదవండి: ఆ బాధ భరించలేకపోతున్నా: కిచ్చా సుదీప్‌ భావోద్వేగం

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)