Breaking News

కొత్త డాన్‌ తప్పుకున్నాడా?

Published on Wed, 12/24/2025 - 15:57

‘ధురంధర్‌’ సినిమా బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌తో మంచి జోష్‌లో ఉన్నారు హీరో రణ్‌వీర్‌ సింగ్‌. అయితే ‘డాన్‌ 3’ సినిమా నుంచి రణ్‌వీర్‌ సింగ్‌ తప్పుకుంటున్నారనే టాక్‌ బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. ఫర్హాన్‌ అక్తర్‌ దర్శకత్వంలో రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా 
‘డాన్‌ 3’ సినిమా రానున్నట్లుగా 2023 ఆగస్టు 9న ప్రకటన వచ్చింది. రితేష్‌ సిద్వానీ, ఫర్హాన్‌ అక్తర్‌ ఈ ‘డాన్‌ 3’ సినిమాను నిర్మిస్తారని, 2025లో ఈ సినిమా విడుదలవుతుందనేది ఆ అనౌన్స్‌మెంట్‌ సారాంశం. కానీ వివిధ కారణాల వల్ల రణ్‌వీర్‌ సింగ్‌ హీరోగా ‘డాన్‌ 3’ సినిమా ఇంకా సెట్స్‌కు వెళ్లలేదు. 

‘ధురంధర్‌’ సినిమా తర్వాత రణ్‌వీర్‌ సింగ్‌ నెక్ట్స్‌ మూవీ ‘డాన్‌ 3’ అని అందరూ అనుకున్నారు. కానీ రణ్‌వీర్‌ సింగ్‌ ఈ సినిమా నుంచి తప్పుకోవాలనుకుంటున్నారని బీ టౌక్‌. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ‘డాన్‌ 3’ సినిమా అనౌన్స్‌మెంట్‌ వచ్చినప్పుడు ‘డాన్‌’గా రణ్‌వీర్‌ సింగ్‌ వెండితెరపై కరెక్ట్‌ కాదన్నట్లుగా కొంతమంది షారుక్‌ ఖాన్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో విమర్శించారు (ఫర్హాన్‌ అక్తర్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘డాన్‌: ది చేజ్‌ బిగిన్స్‌ ఎగైన్‌ (2006), ‘డాన్‌ 2 (2011) చిత్రాల్లో షారుక్‌ ఖాన్‌ హీరోగా నటించారు). 

కానీ ‘డాన్‌ 3’లో యాక్టర్‌గా తాను ప్రేక్షకులను మెప్పిస్తానని రణ్‌వీర్‌ సింగ్‌ రెస్పాండ్‌ అయ్యారు. అయితే ఈ ్ర΄ాజెక్ట్‌ నుంచి ఆయన తప్పుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే... రణ్‌వీర్‌ సింగ్‌ కొత్త సినిమాకు ‘ప్రళయ్‌’ అనే టైటిల్‌ ఖరారైందని, ఇదొక జాంబీ ఫిల్మ్‌ అని, ఒక తండ్రి తన కుటుంబాన్ని ఎలా రక్షించుకుంటాడు? అనే కోణంలో ఈ సినిమా కథనం సాగుతుందని బాలీవుడ్‌ టాక్‌. 

Videos

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)