Breaking News

స్టార్‌ హీరో సినిమా.. ఆసుపత్రి పాలైన 100 మంది

Published on Tue, 08/19/2025 - 08:02

బాలీవుడ్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్ (Ranveer Singh) నటిస్తున్న చిత్రం 'ధురంధర్‌'.. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం లడఖ్‌ ప్రాంతంలో జరుగుతుంది. అయితే, తాజాగా ఈ చిత్ర యూనిట్‌ నుంచి సుమారు 100 మందకి పైగా ఆసుపత్రిపాలయ్యారు. వారందరూ లేహ్‌లోని  సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు.

లడఖ్‌లోని లేహ్‌ జిల్లాలో కొద్దిరోజులుగా ధురంధర్‌ సినిమా షూటింగ్‌ జరుగుతుంది. సెట్స్‌లో పనిచేస్తున్న కార్మికులు ఆదివారం రాత్రి భోజనం చేసిన తర్వాత తీవ్రమైన ఇబ్బందులకు గురయ్యారు.  అకస్మాత్తుగా సెట్‌లోని చాలా మందికి తీవ్రమైన కడుపు నొప్పి, వాంతులు, తలనొప్పి వచ్చింది. వారిని లేహ్‌లోని సజల్ నర్బు మెమోరియల్ (SNM) ఆసుపత్రికి తరలించారు. అయితే, చికిత్స అందించిన వైద్యులు ఇది సామూహిక ఫుడ్ పాయిజనింగ్ కేసుగా గుర్తించారు. సినిమా సెట్స్‌లో దాదాపు 600 మంది భోజనం చేశారని అక్కడి వారు చెబుతున్నారు. అయితే, కొందరు మాత్రమే అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. విషయం తెలుసుకున్న పోలీసులు కూడా ఆసుపత్రి వద్దకు చేరుకుని విచారిస్తున్నారు.

దర్శకుడు ఆదిత్య ధర్‌ తెరకెక్కిస్తున్న  ‘ధురంధర్‌’ సినిమాలో రణ్‌వీర్‌ సింగ్‌తో పాటు  సంజయ్‌ దత్‌, అర్జున్‌ రాంపాల్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఇదే ఏడాది డిసెంబరు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)