Breaking News

దేవతను దెయ్యంగా వర్ణించిన బాలీవుడ్‌ హీరో

Published on Sun, 11/30/2025 - 12:52

ఎంతో అట్టహాసంగా కొనసాగిన ఇఫీ (అంతర్జాతీయ చలనచిత్రోత్సవ) వేడుకలు శుక్రవారం (నవంబర్‌ 28న) విజయవంతంగా ముగిశాయి. గోవాలో ఈ ముగింపు వేడుకకు కాంతార హీరో రిషబ్‌ శెట్టితో పాటు బాలీవుడ్‌ స్టార్‌ రణ్‌వీర్‌ సింగ్‌ సైతం హాజరయ్యాడు. కానీ అత్యుత్సాహంతో రణ్‌వీర్‌ చేసిన కామెంట్స్‌పై కన్నడ ప్రేక్షకులు మండిపడుతున్నారు.

ఇంతకీ ఏం జరిగిందంటే?
స్టేజీపై రణ్‌వీర్‌ మాట్లాడుతూ.. నేను కాంతార: చాప్టర్‌ 1 థియేటర్‌లో చూశాను. రిషబ్‌ పర్ఫామెన్స్‌ అద్భుతంగా ఉంది. ఆడ దెయ్యం అతడి శరీరంలో ప్రవేశించినప్పుడు వచ్చే సన్నివేశం అయితే అమేజింగ్‌ అంటూ ఆ సీన్‌ను రీక్రియేట్‌ చేసేందుకు ప్రయత్నించాడు. అలాగే తనను కాంతార 3లో చూడాలనుకుంటే రిషబ్‌ను మీరే ఒప్పించండి అని ప్రేక్షకులను కోరాడు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఒక నటుడిగా స్టేజీపై ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? అనేది కూడా తెలీదా? దైవాన్ని పట్టుకుని దెయ్యం అంటాడేంటి? దేవతను కించరిచే హక్కు ఈయనకెక్కడిది? అని మండిపడుతున్నారు.

కాంతార విశేషాలు
రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహించడంతో పాటు హీరోగా నటించిన కాంతార చిత్రం (Kantara Movie) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 2022లో వచ్చిన ఈ చిత్రం దాదాపు రూ.450 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. ఈ ఏడాది ఈ మూవీకి ప్రీక్వెల్‌గా కాంతార: చాప్టర్‌ 1 రిలీజైంది. జయరామ్‌, రుక్మిణి వసంత్‌, గుల్షన్‌ దేవయ్య కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం ఏకంగా రూ.850 కోట్ల కలెక్షన్స్‌ వసూలు చేసింది.

 

 

చదవండి: ప్రకాశ్‌ రాజ్‌ భార్యగా ఛాన్స్‌.. ఐదుగురితో కాంప్రమైజ్‌ అడిగారు

Videos

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)